బీహార్‌కు చెందిన మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ సొంత పార్టీకే షాక్ ఇచ్చారు. ఢిల్లీ క్రికెట్ ఆసోసియేషన్‌లో అవినీతికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలను బేఖాతరు చేస్తూ కీర్తి ఆజాద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ అక్రమాల గురించి వివరించారు.డీడీసీఏ పలు కాంట్రాక్టులను టెండర్లు పిలవకుండానే నకిలీ కంపెనీలకు కట్టబట్టిందని ఆరోపించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఈడీ, డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.