అంగన్‌వాడీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తిస్తూ వారి ఉసురు పోసుకుంటున్నాయి. మాతా శిశు సంక్షేమంలో, శిశు, బాలింత మరణాల నివారణలో ప్రపంచంలోనే అథమస్థాయిలో ఉండి కూడా వారికి కాస్తంత ఊరట కల్పిస్తున్న ఐసిడిఎస్ నిర్వీర్యానికి కేంద్రంలో బిజెపి సర్కారు కుయుక్తులు పన్నుతుండగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అదే బాటలో నడుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణే కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ఒంటి చేత్తో ఈదుతున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం హామీ ఇచ్చి తప్పించుకు తిరుగుతోంది.