2015

బాక్సైట్ పోరు ఉధృతం:రఘువీరా

 ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా చేపట్టిన బాక్సైట్ తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 28, 29 తేదీల్లో విశాఖ మన్యంలో కాంగ్రెస్ నాయకులు, గిరిజన ఎంపీల బృందం పర్యటించాలని నిర్ణయించినట్లు రఘవీరా తెలిపారు.

కాల్ మనీపై గవర్నర్కు ఫిర్యాదు

విజయవాడ రాష్ట్రంలో బయటపడిన కాల్ మనీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డబ్బు ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన డబ్బే కాకుండా ఆ పార్టీకి చెందిన మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్సీల డబ్బు కూడా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్..గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.

సింగపూర్‌ చంద్రబంధంలో అమరావతి

 ఆలూలేదు, చూలూ లేదు అమరావతి అంతర్జాతీయ నగరం అని ఆర్భాటం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం-ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కల్పించిన భ్రమలూ, చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 'సింగపూర్‌ కంపెనీల గొంతెమ్మ కోర్కెలు' శీర్షికతో ఈనాడు పత్రిక డిసె ంబర్‌ 11న ఇచ్చిన వార్త దీనికొనసాగింపే. ఆ వెంటనే సదరు వార్తను సమతుల్యం చేసేందుకన్నట్టు ఆంధ్రజ్యోతి మరో వార్తా కథనం ప్రచురించింది.

అప్రజాస్వామిక కమిటీలు..

 జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలన నిర్వహిస్తున్న తీరు అప్రజాస్వామికం, దుర్మార్గం. ఏ మాత్రం చట్టబద్ధత కానీ, రాజ్యాంగబద్ధత కానీ లేని ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో సర్వం తామే అయి వ్యవహరిస్తున్న విధానం విస్మయాన్ని కలిగిస్తోంది. రేషన్‌ కార్డులు, ఫించన్ల నుండి వరద సాయం వరకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో స్థానిక సంస్థలు నామమాత్రంగా మారుతున్నాయి.

కల్బుర్గి కేసులో సిఐడి విఫలం..

ప్రముఖ రచయిత, హేతువాది ఎంఎం కల్బుర్గిపై హత్య జరిగి వంద రోజులు గడుస్తున్న కర్నాటక సిఐడి నిందితులను గుర్తించడంలో విఫలమైంది. దీంతో కర్నాటక ప్రభుత్వం కేసును సిబిఐకు అప్పగించాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రాన్ని కోరారు.

వచ్చే ఏడాది మోడీ పాక్ పర్యటన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఏడాది పాక్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో తన పాక్ పర్యటనపై సుష్మా ప్రకటన చేశారు. 2016లో పాక్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మోడీ హజరౌతారని తెలిపారు.

సీమకు అన్యాయం జరగనివ్వం:మధు

రాయలసీమకు ఎలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.రాయలసీమ అభివృద్ధి సమితి అధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ అభివృద్ధిపై నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు..అలాంటి ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకొంటోందని, టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

లోక్‌సభలో ఎగవేతదారుల వివరాలు

ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొత్తం ఎగవేతల విలువ రూ. 64,334 కోట్లని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. రుణగ్రహీతలతో బ్యాంకు అధికారులు కుమ్మక్కైన కేసులు 115 అని శుక్రవారం ప్రభుత్వం వెల్లడి చేసింది. నిరర్థక ఆస్తుల అంశం ఒక ముఖ్య సవాలుగా ఉందని అంటూ, దీని పరిష్కారం కోసం బహుళ స్థాయిల్లో వేగవంతమైన చర్యలు తీసుకుంటు న్నామని ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అన్నారు. రూ. 25 లక్షలకు మించి రుణం తీసుకున్న ఉద్దేశపూరిత ఎగవేతదారులుగా 7,265 మందిని గుర్తించామని చెబుతూ, వారి వివరాలను సిన్హా సభలో వెల్లడి చేశారు. 

మోడీ వీసా రికార్డులు ఇవ్వాలి..

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను వచ్చే ఫిబ్రవరి నాటికి తమకు సమర్పించాలని అమెరికా ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి విదేశాంగశాఖను ఆదేశించారు. 

Pages

Subscribe to RSS - 2015