March

భూముల రక్షణకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

           భూములను రక్షించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ సేకరణపై ప్రభుత్వం ముందడుగు వేస్తే రైతులకు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్‌టిసి కాంపెక్స్‌ వద్ద సోమవారం భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిసిపిఐఆర్‌ కోసం ప్రభుత్వం వంద పంచాయతీల్లో లక్షా 30 వేల ఎకరాల భూమిని రైతుల వద్ద బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.

ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం ఫై ఇంజినీరింగ్‌ నిపుణుల బృందంచే విచారణ జరిపించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో  బృందం   పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.  ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.

రైల్వే జోన్‌ పై ఎంపి కె. హరిబాబు ప్రకటనపై సిపిఐ(ఎం) నిరసన

     విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఆందోళన

ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఈ నెల 22న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ప్రదర్శన నిర్వహించనున్నారు.గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తామని చెప్పిన టిడిపి ప్రభుత్వం, 21 మాసాలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని వారు విమర్శించారు. 21 మాసాలలో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలలో ఇళ్ల నిర్మాణం గానీ, స్థలాల కేటాయింపుగానీ జరగలేదని పేర్కొన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఉండగా, పట్టాలు లేకుండా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నవారు కూడా ఉన్నారన్నారు.

పీర్‌లెస్‌ రక్షణ ప్రభుత్వ బాధ్యత..

దేశంలోని చిన్న మొత్తాల పొదుపు సంస్థలలో ప్రముఖ స్థానంలో ఉండి ఆర్‌బిఐ నిబంధనలకనుగుణంగా నడుస్తూ ప్రజాభిమా నాన్ని చూరగొన్న సంస్థ పీర్‌లెస్‌ జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ లిమి టెడ్‌. నిజాయితీగా తన ఖాతాదారులకు మెచ్యూరిటీ సొమ్మును అందిస్తున్న ఈ సంస్థ ఆర్‌బిఐ విధించిన ఆంక్షల ఫలితంగా తన వ్యాపారాన్ని 2011 ఏప్రిల్‌ 1 నుంచి ఆపేయాల్సి వచ్చింది. దీనితో పీర్‌లెస్‌ సంస్థ ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ఖాతాదారులు తిరిగి తమ డబ్బును పీర్‌లెస్‌ సంస్థలో పొదుపు చేసుకొనే అవకాశం కోల్పో యారు.

కులం కోసం కాదు.. కూటి కోసం

ప్రస్తుతం దేశంలో కుల, మతాల జాడ్యం పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ప్రజలు కులం కోసం కాకుండా, కూటి కోసం పోరాడాలని ప్రముఖ విప్లవ సినీ గేయ రచయిత వంగపండు ప్రసాద్‌ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడు పినిపే సత్యనారాయణ రాసిన 'ధిక్కార ఖడ్గం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.అంబేద్కర్‌ మనల్ని కులం కంటే కూటి కోసమే పోరాడాలని చెప్పారన్నారు. డబ్బుకు ప్రాణం లేకపోయినా అన్నింటినీ శాసిస్తుందన్నారు. 

మాల్య , మోడీ లను అరెస్ట్ చేయండి:కాంగ్

ప్రభుత్వ రంగ బ్యాంకులకు శఠగోపం పెట్టిన విజయ్ మాల్యాపై రాజ్యసభలో సోమవారం రభస జరిగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలోనే విజయ్ మాల్యా భారీగా బ్యాంకు రుణాలు పొందారన్నారు. గత దశాబ్దంలో విపరీతంగా రుణాలు విజయ్ మాల్యాకు ఎలా లభించాయో కాంగ్రెస్ చెప్పాల్సి ఉందన్నారు.కాంగ్రెస్ స్పందిస్తూ ‘‘మీరు రుణం ఇవ్వండి... నన్ను ఒంటరిగా వదిలేయండి’’ అనే వైఖరిని మాల్యా అనుసరిస్తున్నారని, అందుకే మీడియాతో సహా అందరిపైనా దాడి చేస్తున్నారని విమర్శించింది.

జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై ఏబీవీపీ కేసులు..

జేఎన్‌యూ అడ్మినిసే్ట్రషన్‌పై చట్టపరమైన చర్యలకు అఖిల భారత విద్యార్థి పరిషత (ఏబీవీపీ) సన్నద్ధమైంది. అఫ్జల్‌ గురుపై ఫిబ్రవరి 9న నిర్వహించిన కార్యక్రమానికి అనుమతిచ్చినందుకు జేఎన్‌యూ అసోసియేట్‌ డీన్‌ పైన, భారత చట్టవిరుద్ధంగా కాశ్మీర్‌ను ఆక్రమించుకుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ప్రొఫెసర్‌ నివేదితా మీనన్‌ పైనా ఏబీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బిల్లులపై బిజెపి మల్ల గుల్లాలు..

పార్లమెంటు తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు మరో మూడు పనిదినాల్లో ముగియనున్న నేపథ్యంలో కీలక బిల్లులకు ఆమోదంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజావేగుల రక్షణ(సవరణ) బిల్లు-2015, కాందిశీకుల ఆస్తుల(సవరణ, ఆమోదం) బిల్లు-2016వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే లోక్‌సభ ఆమోదించిన ఆధార్‌ బిల్లుకు రాజ్యసభలో, ఎగువసభ ఆమోదముద్ర వేసిన రియల్‌ ఎస్టేట్‌ బిల్లుకు లోక్‌సభలో అంగీకారం పొందాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని చర్చనీయాంశాలు దిగువసభలో ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్‌ 20 నుంచి పార్లమెంటు రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Pages

Subscribe to RSS - March