March

విశాఖ రైల్వేజోన్‌ సంగతేంటి?

చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్‌ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు.

బిజెపి బరిలో బోస్ మనవడు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీతో బీజేపీ అభ్యర్థిగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ మనవడైన చంద్రకుమార్ బోస్ తలపడనున్నారు. మమతపై తమ అభ్యర్థిగా 55 ఏళ్ల చంద్రకుమార్ పోటీ చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు.

JNUలో రాందేవ్‌బాబా పాఠాలు..

జేఎన్‌యూ క్యాంపస్‌లో భారీ యోగా శిబిరం నిర్వహించాలని బాబా రాందేవ్‌ యోచిస్తున్నారు. అయితే దీనికి సంబందించి తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వేదాంత, ఆయుర్వేద అంశాలపై యూనివర్సిటీలో జరిగే ఓ విద్యా సదస్సులో బాబా రాందేవ్‌ ప్రసంగిస్తారనే ప్రచారం సాగింది. దీనిపై అథ్యాపకుల్లో ఒక వర్గం నుంచి జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఈ సదస్సుకు రాందేవ్‌ బాబా హాజరు కాలేదు.

ఇష్రాత్ కేసులో కీలక డాక్యుమెంట్..

ఇష్రాత్ జహాన్ కేసులో కీలకమైన డాక్యుమెంట్ గల్లంతైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్ లో చేసిన మార్పుల కు సంబంధించిన డ్రాఫ్ట్ నోట్ గల్లంతైంది.యూపీఏ హయాంలో పి.చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అఫడవిట్ లో చేసిన మార్పులకు సంబంధించిన డ్రాఫ్ట్ నోట్ హోంమంత్రిత్వ శాఖలో గల్లంతైంది. 

AP వ్యవసాయ బడ్జెట్ వివరాలు..

Ap రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు..

వ్యవసాయ బడ్జెట్ హెలైట్స్

AP బడ్జెట్ 2016-17 హైలెట్స్..

  • బడ్జెట్ వ్యయం రూ.1,35,688 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం రూ.86,584 కోట్లు
  • ప్రణాళికా వ్యయం రూ. 49,134
  • ఆర్థిక లోటు రూ. 20,497 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లు
  • వృద్ధిరేటు లక్ష్యం 10.9 శాతం
  • రుణమాఫీకి 3,512 రూ. కోట్లు
  • అమరావతి నిర్మాణానికి రూ. 1500 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ.7,325 కోట్లు
  • పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ.2,548 కోట్లు
  • గృహనిర్మాణానికి రూ.1,132కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.2,233 కోట్లు
  • కాపు కార్పొరేషన్కు రూ. వెయ్యి కోట్లు

లక్షా 35 వేల 688 కోట్ల బడ్జెట్

ఏపీ శాసనసభలో 2016-17 సంవత్సరానికి రూ.1, 35,688 కోట్లతో ఏపీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల శాసనసభ ఎదుట ప్రవేశ పెట్టారు.2029 నాటికి మోస్ట్ డెవలప్ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని, ఏడాది పాలనలోనే రెండంకెల వృద్ధి రేటును సాధించడానికి చర్యలు తీసుకున్నామన్నారు.ప్రణాళిక వ్యయం రూ. 49,134 కోట్లు. ప్రణాళికేతర వ్యయం రూ.86,554 కోట్లు. ఆర్థిక లోటు రూ. 20,491 కోట్లు కేంద్రం నుండి వచ్చింది రూ.2,333 కోట్లు గా తెలిపారు.

అమెరికా నగరాల పై వాస్తవాలు మరుగున పరుస్తున్న విశాఖనగర ప్రజాప్రతినిధులు. మౌలికసదుపాయాలు, సేవలు, ప్రైవేటీకరణకు కుట్ర.

అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏలు  అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల  గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు  బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్‌, పొల్యుషన్  సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్‌ చార్జీలు  వసూలు  చేస్తారని తెలియజేస్తున్నారు.

ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారాలు లేకుండా చూడాలి. పేద‌ల‌కు ఆంక్ష‌లు లేకుండా క‌నెక్ష‌లు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ బ‌కాయిలు ప్ర‌భుత్వ‌మే చెల్లించాలి.

    విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి  ఆదాయము, వ్యయముల‌పై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్‌పై విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ బహిరంగ విచారణలో  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్‌.బాబూరావు  ప‌లు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్‌ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనల‌ను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్‌, కుటీరపరిశ్రమల‌పై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది.

Pages

Subscribe to RSS - March