March

ఇదేనా జవాబుదారీతనం?

ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ చర్యలపై కాంగ్రెస్‌, వామపక్షాలు సంధించిన విమర్శనాస్త్రాలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిన ప్రధాని నరేంద్ర మోడీ ఎదురు దాడికి దిగడం దారుణం. పార్లమెంటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని గురువారం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రతిపక్షాలను కవ్వించే రీతిలో సాగింది. సాధారణంగా ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేదిగా ప్రధాని సమాధానం వుంటుంది. కానీ, గురువారం నాటి మోడీ సమాధానం దీనికి పూర్తి భిన్నంగా వుంది. విమర్శకు ప్రతి విమర్శ ఎప్పుడూ సమాధానం కాదు.

RTI పై ఏచూరి అఫిడివిట్ దాఖలు..

 సమాచార హక్కు చట్టం పరిధి నుండి రాజకీయ పార్టీలను మినహాయించాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుఫ్రీం కోర్టులో అఫిడివిట్ దాఖలు చేశారు.  సమాచార హక్కు చట్టం క్రింద పార్టీ కార్యకలాపాలు, ఆర్ధిక అంశాలతో పాటు అంతర్గత వివరాలు తెలపాలంటూ సామాజిక కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ , డెమక్రాటిక్ రైట్స్ అనే ఎన్‍జీఓ తో కలిసి కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, బిఎస్‍పి, సిపిఐ, ఎన్‍సిపి పార్టీలకు దరఖాస్తు చేశారు..

రాజధానిలో భూ వినియోగం..

రాజధాని ప్రాంతంలో తుది మాస్టర్‌ప్లాను విడుదల అనంతరం భూముల కేటాయింపుపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రైతులకు కేటాయించే భూమి వివరాలతోపాటు, మొత్తం నగరంలో భూమిని దేనికి ఎంతవాడుతున్నారనే విషయాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. దీనిలో రాజధాని నగరంలో ఉన్న 53676 ఎకరాలకు సంబంధించిన వినియోగంపై స్పష్టత ఇచ్చారు. దీనిలో అన్ని రకాల నివాస ప్రాంతాలకు 16031 ఎకరాలను కేటాయించారు. వాణిజ్య ప్రాంతాలకు 6135 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2714 ఎకరాల్లో లాజిస్టిక్‌ జోన్‌ ఏర్పాటు చేయనున్నారు.

మహిళలకు 33 శాతం..Ap అసెంబ్లీ

 చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ తీర్మానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అభ్యున్నతిపై సభలో చర్చ చేపట్టారు. అనంతరం మహిళలకు రిజర్లేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. 33 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సభ తీర్మానాన్ని ఆమోదించింది.

సీమలో సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ ఏది? : మధు

రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోరుతూ వామ పక్షాలు చేపట్టిన బస్సుయాత్ర సందర్బంగా మధు మాట్లాడుతూ, రాయలసీమలో ఏటేటా రైతు ఆత్మహత్యలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీరు లేదని, భూగర్భ జలాలు అడుగంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో హంద్రీ నీవా, గాలేరు నగరికి తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

6లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాజ్యసభకు ప్రభుత్వం తెలిపింది. ఖాళీగా ఉన్న 6,02,325 ఉద్యోగాల్లో 5,33,081 గ్రూప్‌ ‘సీ’కి చెందినవని సిబ్బంది, ప్రజాసంబంధాలు, పింఛన్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 51,478 గ్రూప్‌ ‘బీ’, 17,766 ఉద్యోగాలు గ్రూప్‌ ‘ఏ’ అధికారుల స్థాయికి చెందినవని పేర్కొన్నారు.

ఏపీతోనూ 'మహా' దౌత్యం

గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం కోసం మహారాష్ట్రతో జరిపిన దౌత్యం మాదిరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌తోనూ ఇదేవిధంగా జల సమస్యలను అధిగమిస్తామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. దేశమంతా నీటి కోసం యుద్ధాలు చేసుకుంటూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక నూతన దిశానిర్దేశం చేశారని చెప్పారు. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై ఈ నెల 8న మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని వెల్లడించారు.

ఇరానీపై సభా హక్కుల నోటీస్‌..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా ఎంపీ సీతారాం ఏచూరి సభా హక్కుల నోటీస్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి ఒక లేఖ రాశారు. గత నెల 24న రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన హక్కులకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఏచూరి తెలిపారు. తాను హిందూ దేవత దుర్గా మాతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానంటూ ఆధారంలేని ఆరోపణలు చేశారని వివరించారు. కేంద్ర మంత్రే స్వయంగా అలా మాట్లాడిన తరువాత తన అంతు చూస్తామంటూ కొంత మంది దుండగులు లెక్కలేనన్ని ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో తనను దూషిస్తున్నారని పేర్కొన్నారు.

EPF పై తుది నిర్ణయం చెప్తాం

ఉద్యోగుల భవిష్యనిధి విత్‌డ్రాలపై పన్ను విధించాలని బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం దీనిపై స్పందిస్తూ, పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చకు తాను సమాధానమిచ్చేటపుడు తుది నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాక్షికంగా వెనక్కి మళ్ళుతామని మంగళవారం ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియ చేసింది. అధిక వేతన జీవులను ఉద్దే శించి ఈ చర్య తీసుకున్నామని, అంతే కానీ 3.7కోట్ల మంది గల ఇపిఎఫ్‌ సభ్యులనుద్దేశించి కాదని జైట్లీ చెప్పారు..

Pages

Subscribe to RSS - March