March

బెంగాల్ కు బలగాలు పంపండి:ఏచూరి

పశ్చిమబెంగాల్‌లో త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటేసే పరిస్థితి కల్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరి విన్నవించారు. బెంగాల్‌ సీపీఐ(ఎం) నేత నీలోత్పల్‌బసుతో కలిసి ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో సీఈసీ నసీంజైదీని ఏచూరి బుధవారం కలిశారు. గత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణం సృష్టించాలని విన్నవించారు. 

కన్నయ్యకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌

రాజద్రోహం ఆరోపణలపై అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 10,000 వ్యక్తిగత పూచీకత్తుపై ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ బుధవారం కోర్టు తీర్పునివ్వడంతో జేఎన్‌యూ విద్యార్థిలోకంలో ఉత్సాహం వెల్లివిరిసింది.

అమరావతిలో అడుగు పెట్టాలంటే ఖర్చే

అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని పదే పదే చెబుతున్నా ఆచరణలో అదెక్కడా కనిపించడం లేదు. ఏ పని చేయాలన్నా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అప్పు తీర్చే బాధ్యత పూర్తిగా సిఆర్‌డిఏ పైనే వేయనుంది. వేలకోట్ల రుణం తీర్చడం అంత తేలికయ్యేపనికాదు. దీనికోసం సిఆర్‌డిఏ రీజియన్‌ పరిధిలో పర్మిషన్లు ఇచ్చేందుకు వసూలు చేస్తున్న వివిధ రకాల ఛార్జీలను గణనీయంగా పెంచనున్నారు. బిల్డింగ్‌ ప్లాను, లేఅవుట్లు, నిర్మాణాల పన్నులు పెరగనున్నాయి. రెవెన్యూ నుండి వసూలు చేస్తున్న స్థల స్వభావ మార్పునూ సిఆర్‌డిఏకు బదలాయించనున్నారు. అమరావతిలో యూజర్‌ ఛార్జీల మోత మోగనుంది.

విద్యుత్ ఛార్జీలు పెంచడం తగదు - సీపీఎం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. రాష్ట్రంలో సుమారు రూ. 270 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రేయ సేకరణ జరగనుంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు.

విద్యాహక్కుచట్టం అమల్లో ప్రభుత్వాలు విఫలం

కేంద్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన విద్యాహక్కు చట్టం అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా విద్యా హక్కుచట్టానికి ఎటువంటి నిధులూ కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. స్టూడెంట్‌, టీచర్‌ నిష్పత్తి ప్రకారం స్కూల్‌లను మూసివేస్తున్నారని, ఇప్పటికే 400 స్కూళ్లను మూసివేశారని విమర్శించారు. అభివృద్ధి చెందాల్సిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను తెరవాల్సినవసరం ఉందన్నారు.

స‌ర్వేల పేరుతో పేద‌ల ఇళ్ల‌ను తొల‌గిస్తే స‌హించేది లేదు. ఇళ్ళు, ప‌ట్టాలు, ప‌ట్టాలు ఇస్తామ‌న్న ఎన్న ఎన్నిక‌ల వాగ్ధానాన్ని నిల‌బెట్టుకోవాలి.

నగరంలో పేద‌లు నివ‌శించే కాలువ‌క‌ట్ట‌ల‌పై ఇళ్లకు సర్వే పేరుతో ప్రభుత్వం   తొగించేందుకు , పేదల‌ను రోడ్డున పడేసేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సిహెచ్‌ బాబూరావు అన్నారు. మంగళవారం సిపిఎం, సిపిఐ నగర కమిటి ఆద్వర్యంలో బుడమేరు మద్యకట్ట ప్రాంతంలో ఇళ్ల సమస్య పరిష్కారం కోరుతూ పాదయాత్రను నిర్వహించారు. బుడమేరు వంతెన వద్ద నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పాల్గన్న సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో బుడమేరు మధ్యకట్ట ఇళ్ళ జోలికి వస్తే సహించేది లేదన్నారు. జనాభా లెక్కులు, ఇతర సర్వే నగరమంతా  చేయకుండా కేవం  కాలువ‌క‌ట్ట‌ల‌పైనే  ఎందుకు చేస్తున్నారో స్పష్ట పరచాల‌న్నారు.

కేంద్రబడ్జెట్లో సీమకు మొండిచేయి:VSR

ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మరోమారు మొండిచెయ్యి చూపించిందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 'రాయలసీమ బస్సుయాత్ర' మంగళవారం గుంతకల్లుకు చేరింది. ఆఖరి రోజు కళ్యాణదుర్గంలో ప్రారంభమైన యాత్ర బెళగుప్ప, కణేకల్‌, ఉరవకొండ, వజ్రకరూరు మీదుగా రాత్రికి గుంతకల్లుకు చేరింది. బుధవారం ఉదయం కర్నూలు జిల్లా మద్దికెరలోకి ప్రవేశిస్తుంది.పలుచోట్ల జరిగిన సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు.

రాష్ట్రం పట్ల ఎందుకీ వివక్ష?

మొన్నటికి మొన్న రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం, నిన్న జనరల్‌ బడ్జెట్‌లోనూ అదే తీరున వ్యవహరించింది. రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకింత వివక్ష? రాష్ట్రంలో వున్నది తన మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమానా? లేక ఆంధ్రప్రదేశ్‌ అంటే ఖాతరులేనితనమా? కేంద్రం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఒక ఎత్తు అయితే, ఇది అన్యాయమని తెలిసినా నోరు మెదపకుండా మిన్నకుండిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత మరో ఎత్తు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి తరువాత మాట్లాడతానని చెప్పడం శోచనీయం. ఇప్పుడు ప్రశ్నించకుండా తరువాత ఎప్పుడో మాట్లాడి ఉపయోగమేమిటి?

JNU వీడియోస్ నకిలీవే..

 జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌పై దేశద్రోహం అభియోగాలకు చూపుతున్న వీడియో సాక్ష్యాల్లో పస లేదని తేలింది. ఢిల్లీ ప్రభుత్వం ఫోరెన్సిక్‌ లేబొరేటరీలకు పంపిన ఏడు వీడియోల్లో రెండు నకిలీవని ట్రూత్‌ ల్యాబ్స్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. 

Pages

Subscribe to RSS - March