March

US వెళ్లనున్న మోడీ,షరీఫ్

నరేంద్ర మోదీ, నవాజ్‌ షరీఫ్ మళ్లీ చేతులు కలపనున్నారు. వారి కరచాలనానికి వాషింగ్టన్‌లో ఒక శిఖరాగ్ర సభ వేదిక కానున్నది. షరీఫ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ మంగళవారం ఈ విషయం చెప్పారు. మార్చి 31, ఏప్రిల్‌ 1న వాషింగ్టన్‌లో జరగనున్న అణుభద్రత శిఖరాగ్ర సభ సందర్భంగా మోదీ, నవాజ్‌లు భేటీ అయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.

మోడీని కలిసినా ప్రయోజనం లేదు..

మోడీని స్వయంగా కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో కేంద్రంపై తన అసంతృప్తిని ఆయన బహిరంగంగా వెల్లడించారు. ప్రత్యేక హాదా, రాజధాని నిర్మాణానికి నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, పారిశ్రామికాభివృద్ధికి ఊతం, పోలవరానికి నిధులు, విశాఖకు రైల్వే జోన్‌ వంటి అంశాల్లో కూడా బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు.

ఇష్రాత్‌ కేసు విచారణకు సుప్రీం

బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఇష్రాత్‌ జహన్‌ను హతమార్చిన ఆరోపణలపై గుజరాత్‌ పోలీసులపై తీసుకున్న చర్యలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటీవల పోలీసుల నిర్బంధంలో ఉన్న లష్కరే తోయిబాకు చెందిన డేవిడ్‌ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 2004 ఇష్రాత్‌ జహన్‌ ఎన్‌కౌంటర్‌లో క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌, సస్పెన్షన్‌ సహా గుజరాత్‌ పోలీసులపై చేపట్టిన అన్ని చర్యలను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలైంది. 

10న దేశవ్యాప్త సమ్మె: దాస్ గుప్తా

న్యూఢిల్లీ : ఇపిఎఫ్‌ వినియోగదారులు విత్‌డ్రా చేసే మొత్తాలపై, యజమానులు చెల్లించే వాటాలపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను బిఎంఎస్‌తో సహా కేంద్ర కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది కార్మిక వ్యతిరేక చర్య అని, ద్వంద్వ పన్నుల విధానానికి ఇదొక చక్కని ఉదాహరణ అని పేర్కొన్నాయి. ఇది కార్మికులపై దాడి చేయడం తప్ప మరొకటి కాదని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి గురుదాస్‌ దాస్‌గుప్తా విమర్శించారు. ఇది పొదుపు చర్యల వ్యతిరేక ప్రతిపాదన అని పేర్కొన్నారు.

బడ్జెట్ పై పవన్ ప్రశ్నిoచడేం ..

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదాకానీ, రాజధాని నిర్మాణానికి కానీ ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఏపీ నేతలంతా పార్టీలకతీతంగా కేంద్రంపై మండిపడుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాత్రం స్పందించకపోవడంపై చర్చ జరుగుతోంది.

JNU విద్యార్థుల పార్లమెంట్‌ మార్చ్‌..

న్యూఢిల్లీ : జెఎన్‌యు విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌, మరో ఇద్దరిపై దేశద్రోహ కేసును నిరసిస్తూ విద్యార్ధులు బుధవారం పార్లమెంట్‌కు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కేసులో అరెస్టయి జైల్లో వున్న మిగిలినవారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు

'తుమ్మపాల సుగర్స్‌'లో ఉద్రిక్తత

 - ఎమ్‌డి ఛాంబర్‌లో రైతులు, కార్మికుల బైటాయింపు
 - తలుపులు బద్దలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
 - బాలకృష్ణ, ఫణిరాజ్‌, హరినాథ్‌బాబులపై కేసులు బనాయింపు

సర్వే పేరుతో పేదల ఇళ్ల తొల‌గింపుకు ప్రభుత్వం కుట్ర ప‌న్న‌డాన్ని వ్యతిరేకించండి. పాదయాత్రలో సిపిఎం - సిపిఐ నాయ‌కులు పిలుపు

పచ్చని పల్లెలను విషతుల్యం చేయడమే అభివృద్ధా ?

భీమిలి మండలం చిప్పాడలో దివీస్‌ లేబొరేటరీస్‌ యూనిట్‌ 3 విస్తరణ ద్వారా పచ్చని పల్లెలు విషతుల్యమవుతాయని, అటువంటి అభివృద్ధిని ఎవ్వరూ కోరుకోరని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి అన్నారు. యూనిట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సిటీ నగర్‌ జంక్షన్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ప్రభావతి సందర్శించి సంఘీభావం తెలిపారు.

Pages

Subscribe to RSS - March