మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణాత్మకమైన శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతాన్ని అక్టోబరు విప్లవం నిరూపించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. రష్యన్ విప్లవం శత వార్షిక ఉత్సవాలను పురష్కరించుకుని సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉద్దరాజు రామం భవనంలో జరిగిన అక్టోబర్ విప్లవ శత వార్షిక సభ నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సీతారాం మట్లాడుతూ కార్మికవర్గం తొలి రాజ్యాధికారం అక్టోబర్ విప్లవం ద్వారా సాధ్యమైందన్నారు. అక్టోబర్ విప్లవ ఫలితంగా ఆవిర్భవించిన సోవియెట్ యూనియన్ హిట్లర్ ఫాసిజాన్ని మట్టికరిపించిదని, ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో సోవియెట్ యూనియన్ 4 కోట్ల మంది సైన్యం , పౌరులను త్యాగం...
పార్టీ కార్యక్రమాలు
కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. సిపిఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి గూండాల దాడులను సిపిఎం కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిపిఎంపై దాడులకు పాల్పడుతున్నారని, 90 ఏళ్ల దేశ చరిత్రలో ఉన్నడూ లేని విధంగా ఒక రాజకీయపార్టీ కార్యాలయాల ముందు మరో రాజకీయ పార్టీ ఆందోళనలు నిర్వహించడం ఇదే తొలిసారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విశాఖలోనూ ఇదే తరహాలో దాడులు చేశారని, ఇదే విధంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం వ్యవహరిస్తే తగిన బుద్ధి...
వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సిపిఎం పోరాడుతోంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా పోలీసు బందోబస్తు మధ్య రిజర్వాయర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తోంది. నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహరం చెల్లించి పునరావాసం కల్పించాకే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకోవడానికి వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి.కృష్ణమూర్తి మరియు నాయకులను హీరమండలం బ్యారేజి సెంటర్లో పోలీసులు అరెస్టు చేశారు
పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు.
ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధనకు విశాఖ జిఎంవిసి గాంధీ విగ్రహం వద్ద 'సేవ్ పబ్లిక్ సెక్టార్-సేవ్ విశాఖ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకుందని, రైల్వే జోన్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకుండా 10 నుంచి 20 శాతం షేర్లను విక్రయించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విజయవాడ రైల్వే స్టేషన్ లో కలిసి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు,కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు సిఐటియు నాయకులు..
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు విజయవాడలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నెలకు 4 రూపాయల చొప్పున గ్యాస్ రేటు పెంచడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్యాస్ పై సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో న్యాయపరమైన పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ చింతూరు లో ర్యాలీ, చట్టివద్ద జాతీయ రహదారిపై బైఠాయింపు..ర్యాలీలో పాల్గోన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మిడియం బాబురావు, భద్రచలం ఎమ్మేల్యే సున్నం రాజయ్య..
రాష్ట్రంలో దళితులపై పలు విధాలుగా జరుగుతున్న దాడులు, కులవివక్ష, దళితుల భూముల్ని లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పది వామపక్షాలు రాష్ట్ర సదస్సు నిర్వహించాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి తదితర గ్రామాల్లో అనేక దశాబ్దాలుగా సాగు చేస్తున్న దళితుల భూముల్ని 'నీరు-చెట్టు' పేరుతో ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం, పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రులో దళితులపై గత మూడు నెలలుగా సాంఘిక బహిష్క రణ చేయడం, చిత్తూరు జిల్లాలో మహాభారతం పేరుతో సాగే ఉత్సవాల్లో దళితుల పట్ల వివక్ష కనబర్చడం వంటి చర్యలపై ఈ సదస్సులో చర్చించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఇతర...
దేవరపల్లి దళుతుల భూపోరాటానికి మద్దతుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వి, రాష్ట్ర కమిటి సభ్యులు సిద్దయ్య తదితర స్థానిక నాయకులు పర్యటించారు. దళితుల భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని,70 సం|| రాలుగా దళితులు సాగుచేసుకున్న భూమి వారికే దక్కేవరకూ సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నేడు విద్యార్థులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు తెలిపారు..విద్యార్థులు కోరుతున్న విధంగా మెస్ చార్జీలను రూ. 750 నుండి రూ. 1500 కు పెంచాలని,హాస్టల్స్ మూసివేతను నిలిపి వేయాలని,సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్ 2017 ను రద్దు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ఆరోగ్యాలను రక్షించాలని, పి.హెచ్.సిలలో రోగులకు భోజనం పెట్టాలని, సిపియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన కేంద్రాలకు చేయూత నివ్వాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శులు లోకనాధం, గంగరావు విశాఖ పూర్ణమార్కెట్ వద్ద క్యాంపెయిన్ చేసి వ్యాపారుల వద్ద నుండి బియ్యం, పప్పులు వగైరా సేకరించారు.