July

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ మ‌రియు లోకాయూక్త ప‌ద‌వుల ఖాళీల భ‌ర్తి కోరుతూ

ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల కోసం అలుపెరగని పోరాటం

రైతులకు తగిన ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడకపోతే దేశ భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని వక్తలు పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం'పై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రాంగణం మొత్తం రైతుల కిక్కిరిసిపోయింది. వందలాది మంది నిల్చునే వక్తల ప్రసంగాలను విన్నారు. అదనపు కుర్చీలనూ వేయించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ విధానాలపై విధాన పత్రాన్ని విడుదల చేశారు.

విజయవాడ వాంబే కాలనీలో ప్రజా రక్షణ యాత్ర

విజయవాడ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా రక్షణ యాత్ర వాంబేకాలనీలో సాగింది. ఈ యాత్రను మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు 90 వేల ఎకరాలను సేకరించారని, కానీ పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించడంలేదని అన్నారు. రాజధానికి సేకరించిన 90 వేల ఎకరాల్లో పది వేల ఎకరాలు ఇస్తే చాలని, రాజధాని ప్రాంతంలోని అర్హులైన పేదలందరికీ ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున స్థలం ఇవ్వొచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇళ్లస్థలాల సాధనకు ఐక్యంగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో ముఖాముఖి

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాని మార్పు చేసి రైతుల నుండి బలవంతంగా భూమి గుంజుకుంటుందని అన్నారు. భూసేకరణ చట్టంలో రైతుల నుండి భూమి తీసుకున్న తర్వాత 5సంవత్సరలోపు ఎటువంటి పనులు ఆభూములలో చేయకపోతే తిరిగిరైతుకు భూమి ఇవ్వాలని ఉందని కానీ చంద్రబాబు భూసేకరణ చట్టసవరణ ద్వారా ఆ విషయాన్ని చట్టం నుండి తొలగించారని అన్నారు.. రైతులకు అండగా సిపిఎం ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

ప్రత్యేకహోదా కోసం వై ఎస్ స్సార్ సిపి చేస్తున్న బంద్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని సీపీఎం ఖండిస్తోంది

Pages

Subscribe to RSS - July