July

అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీ

విజయనగరం జిల్లా సాలూరు లోని గిరిజన ప్రాంతాలలో శిఖపరువు,తామరకొండ, పోలిమెట్ట,దుక్కడమెట్టల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో తామరకోండ,పోలిమెట్ట,దుక్కడమెట్ట శిఖపరువు కొండలను త్రవ్వకాలు చేయవదంటూ సిపిఎం నాయకత్వంలో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున్న ఆందోళన చేస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతంలోని  పనులు అడ్డుకోవడం కోసం  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు , సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్ కృష్ణమూర్తి ప్రజలతో  కలిసి ర్యాలీగా బయలుదేరారు.. 

దళితులపై దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు

రాష్ట్రంలో దళితులపై పలు విధాలుగా జరుగుతున్న దాడులు, కులవివక్ష, దళితుల భూముల్ని లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పది వామపక్షాలు రాష్ట్ర సదస్సు నిర్వహించాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి తదితర గ్రామాల్లో అనేక దశాబ్దాలుగా సాగు చేస్తున్న దళితుల భూముల్ని 'నీరు-చెట్టు' పేరుతో ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం, పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రులో దళితులపై గత మూడు నెలలుగా సాంఘిక బహిష్క రణ చేయడం, చిత్తూరు జిల్లాలో మహాభారతం పేరుతో సాగే ఉత్సవాల్లో దళితుల పట్ల వివక్ష కనబర్చడం వంటి చర్యలపై ఈ సదస్సులో చర్చించారు.

విశాఖపట్నం లోని హిందూస్తాన్ జింక్ కు చెందిన స్థలాల్ని వేదాంత కంపెనీ అమ్మకానికి పెట్టడాన్ని ప్రభుత్వం అనుమతించరాదు

ద‌ళితుల‌కు భూమి ద‌క్కే వ‌ర‌కు ఐక్య‌పోరాటం

దేవరపల్లి దళుతుల భూపోరాటానికి మద్దతుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వి, రాష్ట్ర కమిటి సభ్యులు సిద్దయ్య తదితర స్థానిక నాయకులు పర్యటించారు. దళితుల భూముల్లో అక్రమంగా చెరువులు తవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని,70 సం|| రాలుగా దళితులు  సాగుచేసుకున్న భూమి వారికే దక్కేవరకూ సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.   

Pages

Subscribe to RSS - July