దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు సెప్టెంబర్ 23న నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి. ఇందులో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్ తదితర సంఘాలు ముఖ్య పాత్ర నిర్వహిస్తు న్నాయి. కరోనాను నివారించడానికి దేశవ్యాప్తంగా 4 గంటల వ్యవధిలో మిలటరీ కర్ఫ్యూ లాగా లాక్‌డౌన్ విధించి నేటికి 6 మాసాలైంది. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.