కరోనా సందర్భాన్ని సైతం బిజెపి దూకుడుగా వినియోగించుకొని ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తోంది. మొన్న జిఎస్‌టి, అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు రైతాంగ వ్యతిరేక చట్ట సవరణలు అన్నీ బుల్డోజు చేసేందుకు పూనుకున్నది. కార్మిక హక్కులను రద్దు చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. అసలే కరోనా మహమ్మారి వ్యాప్తిలో ప్రభుత్వ వైద్య సహాయం మృగ్యమైంది. బాధ్యతారహితంగా లాక్‌డౌన్ అమలు జరిపి కోటాను కోట్ల అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిని దెబ్బగొట్టింది. ఈ పరిణామాలు చిన్న చిన్న వ్యాపారాల్ని, చిన్న ఉత్పత్తిదారుల్ని, వృత్తుల్ని సంక్షోభం లోకి నెట్టింది.