పారిశ్రామికోత్పత్తిలో క్షీణత, పెట్టుబడుల్లో స్తబ్దత నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలకు గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీలు కోత పెట్టాయి. ప్రజల కొనుగోలు శక్తిలో పెద్ద మార్పులు లేకపోవడం, ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటును 7 శాతానికి అంచనా వేశాయి. ఇది వరకు ఈ వృద్ధి రేటును 7.5 శాతంగా ఉంటుందని పేర్కొన్నాయి. వచ్చే మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.1 శాతానికి పరి మితం కావచ్చని యుబిఎస్, 7 శాతానికి తగ్గొచ్చని మూడీస్ సంస్థలు వేరు వేరుగా వెల్లడించాయి.