September

వివిధ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్లు, ఎయిడెడ్ కళాశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ...

గౌరవనీయులైన జడ్జీగారికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, మాజీమంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

కార్మికవర్గంపై మోడీ దాడిని ప్రతిఘటిద్దాం

దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 23న నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి. ఇందులో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌ తదితర సంఘాలు ముఖ్య పాత్ర నిర్వహిస్తు న్నాయి. కరోనాను నివారించడానికి దేశవ్యాప్తంగా 4 గంటల వ్యవధిలో మిలటరీ కర్ఫ్యూ లాగా లాక్‌డౌన్‌ విధించి నేటికి 6 మాసాలైంది. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ప్రమాదకర బిజెపి విధానాలు

కరోనా సందర్భాన్ని సైతం బిజెపి దూకుడుగా వినియోగించుకొని ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తోంది. మొన్న జిఎస్‌టి, అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు రైతాంగ వ్యతిరేక చట్ట సవరణలు అన్నీ బుల్డోజు చేసేందుకు పూనుకున్నది. కార్మిక హక్కులను రద్దు చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. అసలే కరోనా మహమ్మారి వ్యాప్తిలో ప్రభుత్వ వైద్య సహాయం మృగ్యమైంది. బాధ్యతారహితంగా లాక్‌డౌన్‌ అమలు జరిపి కోటాను కోట్ల అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిని దెబ్బగొట్టింది. ఈ పరిణామాలు చిన్న చిన్న వ్యాపారాల్ని, చిన్న ఉత్పత్తిదారుల్ని, వృత్తుల్ని సంక్షోభం లోకి నెట్టింది.

Pages

Subscribe to RSS - September