September

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించాయని, తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి వ్యాధులను అరికట్టే చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిపిఎం ప్రజారోగ్య కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజారోగ్య రాష్ట్ర కమిటీ సభ్యులు టి.కామేశ్వరరావు, బిఎల్‌ నారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 13వేల మలేరియా కేసులు నమోదు కాగా, ఒక్క విశాఖలోనే 7210 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు.రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు.

భూబ్యాంక్‌ ఎవరికోసం? :CPM

ప్రభుత్వ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న భూములు సహా మొత్తం 15 లక్షల ఎకరాలతో రాష్ట్రంలో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచలేదన్నారు. ఈ విధానాలు సామాన్య ప్రజల సంక్షేమానికి చేటు తెస్తాయని, తమ పార్టీ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్ర కమిటీ సమావేశాలు..

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవాడలో నిర్వహించారు.విద్య, వైద్యాన్ని రైతుల భూములనూ కార్పొరేట్‌ రంగానికి ధారాదత్తం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేట్‌ పరిపాలన ప్రవేశపెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. ఉన్నత విద్య బాధ్యత తమది కాదనీ, దాన్ని కార్పొరేట్‌ రంగం సామాజిక బాధ్యతగా భóుజస్కం ధాలపై వేసుకోవాలని ఉపాధ్యాయ దినోత్సవం నాడు స్వయానా ముఖ్యమంత్రే చెప్పారని మధు గుర్తు చేశారు.

కోటవురట్ల మండలం గొట్టివాడ ఇసుక ర్యాంపుని వెంటనే ఆపాలి.

 

కోటవురట్ల మండలం గొట్టివాడ ఇసుక ర్యాంపుని వెంటనే ఆపాలని ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాచేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. 

Pages

Subscribe to RSS - September