ప్రధాని లాహోర్ పర్యటనను వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు స్వాగతించాయి. ఇరు దేశాల మధ్య చర్చలు స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగాలని సీపీఎం అభిప్రాయపడింది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవ్వాలని, ఇదే విద్వేషవాదులకు, ఉగ్రవాదులకు అసలైన విరుగుడు అవుతుందని, పాకిస్తాన్ ప్రధానితో తన భేటీకి ఏ అంశాలు ప్రేరణగా నిలిచాయో భారత ప్రధాని జాతికి తెలియజేస్తారని ఆశిస్తున్నామని సీపీఎం అభిప్రాయపడింది..