దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఏకవ్యక్తి పాలనలు నడుస్తున్నాయని, రాజకీయ విలువలు ఎక్కడా పాటించడం లేదని, తక్షణమే ప్రత్యక్ష ఎన్నికలు జరిపి పాలన సాగిస్తే బాగుంటుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో కుక్కల్లా కొట్లాడుతూ... అసెంబ్లీలో కాకుల్లా అరుస్తూ... ప్రజాధనాన్ని, సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.