2015

అంబేద్కర్‌ది ఎనలేని పోరు:దడాల

దళితులపై నేటికీ జరుగుతున్న దాడులకు మను ధర్మశాస్త్ర భావజాలమే కారణమని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ యుటిఎఫ్‌ భవన్‌లో జన చైతన్యమండలి ఆధ్వర్యాన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన 88వ మనుస్మృతి దహన దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దడాల మాట్లాడుతూ కులవ్యవస్థపై అంబేద్కర్‌ ఎనలేని పోరు చేశారన్నారు. దళితులతోపాటు, దేశంలో మహిళలకు స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మను ధర్మశాస్త్రానికి విరుగుడుగా భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. నేటి ప్రభుత్వాలు ఆయన లక్ష్యాన్ని విస్మరిస్తున్నా యన్నారు.

బాక్సైట్ తవ్వకాలపై తీవ్ర నిరసన..

విశాఖ ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గిరిజనులు, సిపిఎం, వివిధ ప్రజాసంఘాల నిరసనల మధ్య అరకు ఉత్సవ్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బాక్సైట్‌ జిఒ 97, స్థానికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఉత్సవాలు చేపట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉభయసభల్లో బిల్లుల ఆమోదం..

శీతాకాలంలో వాడివేడిగా సాగిన పార్లమెంట్‌ ఉభయసభలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఎన్డీయే సర్కారు మెజార్టీలో ఉన్న లోక్‌సభలో మొత్తం 13 బిల్లులకు ఆమోదం లభించగా, రాజ్యసభలో తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి...బాలల న్యాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక బిల్లు, బోనస్‌ చెల్లింపుల బిల్లు, ఆర్బిట్రేషన్‌, కాన్సిలేషన్‌(సవరణ)బిల్లు, పరిశ్రమల (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు, అణుశక్తి సవరణ బిల్లు, వాణిజ్య కోర్టులు, డివిజన్లు, వాణిజ్య అప్పిలేట్‌ డివిజన్‌ హైకోర్టుల బిల్లు, న్యాయమూర్తుల వేతనాల సవరణ బిల్లు తదితర బిల్లులున్నాయి.

భారీగా పెరగనున్న ఎంపీల జీతాలు..

లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం వచ్చే జీతం, అలవెన్సులు డబుల్ కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాశాఖ ప్రతిపాదనలు చేసింది. ఓ ఎంపీ నెల జీతం రూ. 50 వేలు. ఇకపై ఇది రూ. లక్ష కానుంది. అదేవిధంగా నియోజకవర్గ నెల భత్యం రూ. 45 వేలు. ఇకపై ఇది రూ. 90 వేలు కానుంది. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమెదం లభిస్తే ఓ ఎంపీ నెల జీతభత్యం రూ. 2.8 లక్షలుగా ఉండనుంది. ఈ ప్రతిపాదనలు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందనున్నట్లు సమాచారం. ఎంపీల జీతభత్యాల సవరణ చివరిసారిగా 2010లో జరిగింది.

సర్కార్ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు:మధు

ఎపి సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా రైతాంగంపై రుణభారం పెరిగిందన్నారు. వ్యవసాయరంగంలో రుణభారం పెరిగిపోయిందని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు , ప్రకాశం జిల్లాల్లో దారుణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

కాషాయ అగ్రనేతల భేటీ..

బీజేపీ సీనీయర్ నేతలు మురళీ మనోహర్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. వృద్ధనేత అద్వానీ, శాంతకుమార్, యశ్వంత్ సిన్హాలు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ సస్పెండ్ పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. డీసీసీఏ నిధులు దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కీర్తి ఆజాద్‌ - హీరో ఆఫ్‌ ద డే

ఢిల్లీ క్రికెట్‌ బోర్డు (డీడీసీఏ) కుంభకోణానికి సంబంధించి జైట్లీపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను శత్రుఘ్నసిన్హా హీరోగా అభివర్ణించారు. 'కీర్తి ఆజాద్‌ - హీరో ఆఫ్‌ ద డే' అంటూ పార్టీపై బహిరంగ విమర్శలు చేస్తున్న శత్రుఘ్నసిన్హా ట్వీట్‌ చేశారు. ఆజాద్‌పై చర్య తీసుకోరాదంటూ ఆయన పార్టీకి విజ్ఞప్తి చేశారు.

కోల్‌స్కామ్‌లో మన్మోహన్‌కు ఊరట

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కోల్‌స్కామ్‌ కేసులో సాక్షిగా చేర్చాలంటూ వేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను కోల్‌స్కామ్‌ కేసులో నిందితుడు, జెఐపిఎల్‌ డైరెక్టర్‌ ఆర్‌ ఎస్‌ రంగ్తా వేశారు. డాక్యుమెంట్లు పిఎమ్‌ఒ కార్యాలయం, నుండి గనుల మంత్రి కార్యాలయం వెళ్లిన డాక్యుమెంట్ల గురించి ప్రశ్నించుటకు మాజీ ప్రధాని మన్మోహన్‌ను సాక్షిగా చేర్చాలంటూ వేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌ పరాషార్‌ తోసిపుచ్చారు.

తిరుపతిలోరోడెక్కినఅంగన్వాడిలు

ఏపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ తిరుపతిలో అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. సమ్మెలో పాల్గొన్న అంన్ వాడీలను తొలగిస్తూ... ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. జీవోకు వ్యతిరేకంగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసిన అంగన్‌వాడీల తొలగించాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమని అంటున్నారు.

Pages

Subscribe to RSS - 2015