October

రసాయన కర్మాగారం ఏర్పాటుపై భయాందోళన

బిసి ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌లిమిటెడ్‌ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం లో నిర్మించ తలపెట్టిన ఎరువులు, రసాయనాల కర్మాగారంపై గురువారం నాడు ఫార్సుగా ప్రజాబి ప్రాయ సేకరణ జరిగింది. ప్లాంటుకు సంబంధిం చి నామమాత్రపు వివరాలు కూడా ఇవ్వకుండా అభి ప్రాయాలు సేకరించడంపై తీవ్రస్థాయిలో విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమీప బంధువులకు ఈ ప్లాంటులో భాగస్వామ్యం ఉండటంతో హడావిడిగా ఈ తంతు ముగించా రన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారో, ఎవరి నుండిసాంకేతిక సహకారం తీసుకుంటున్నారో వంటి అంశాలను కూడా ప్రజల కు వివరించకపోవడం గమనార్హం. 

కడప కలెక్టరేట్ ముట్టడి..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు పీడిత ప్రాంత మైన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం  ఆధ్వర్యం లో  పెద్దఎత్తున కడప కలెక్టరేట్ను ముట్టడించారు.ధర్నాకు వస్తున్న ప్రజలనూ, పార్టీ కార్యకర్తలనూ, నాయకులనూ పోలీ సులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ధర్నానుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ..రాయలసీమలో విద్య, ఉపాధితోపాటు వర్షాలు లేక అన్నిట్లోనూ వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిషన్‌ తన రిపోర్టులో పేర్కొందని గుర్తు చేశారు.

రాజ్యంలో మతం - మతంతో రాజకీయం

భారత్‌ ''భిన్నత్వంలో ఏకత్వం'' ఉన్న దేశం. మన గొప్పతనానికి, ప్రజల ప్రశాంత జీవనానికి అదే కారణం. భిన్న కులాలు, మతాలు, జాతులు, సంస్కతుల మధ్య భాసిల్లిన భారతీయతకు ఇప్పుడు భంగం వాటిల్లింది. ''రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాక పోతే అది చెడుగా మారు తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచి వారైతే మంచిదిగా మారుతుంది'' అని డాక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం భారత దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. లౌకికవాదానికి నిఘంటువులు ''ఈ భౌతిక ప్రపంచానికి చెందిన, ఆధ్యాత్మికం కాని, మతాతీతమైన'' అనే అర్థాలనిచ్చాయి.

UPఘటనపై అట్రాసిటీకేసు:VSR

ఉత్తరప్రదేశ్‌లోని దళితులపై దాడి చేసిన దన్కౌర పోలీస్టేషన్‌ అధికారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిఎస్‌ఎంఎం జాతీయ నేత వి.శ్రీని వాసరావు డిమాండు చేశారు. దళిత కుంటుంబంపై జరిగిన దాడిన నిరసిస్తూ బుధవారం దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో కార్యకర్తలు ఢిల్లీలోని యూపి భవన్‌ను ముట్టడికి యత్నిస్తే ఢిల్లీ పోలీసులు అనుమతి లేదని మధ్యలోనే అడ్డుకున్నారు. కేంద్ర, యూపి ప్రభుత్వాలకు వ్యతిరే కంగా పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు.

అభివృద్ధి కేంద్రీకరణ తగదు:BVR

రాజధాని నిర్మాణం పూర్తిగా కార్పొరేట్ల కోసమే చేస్తున్నట్లుందని, రైతుల ప్రస్తావన, వారి సంక్షేమం కనిపించడం లేదని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను గ్రీన్‌ఫీల్డు పేరు తో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుం డా ఏకపక్షంగా ముందుకు వెళుతూ వ్యాపార రాజధానిగా మారుస్తున్నారన్నా రు. రాజధాని కార్పొరేట్ల కోసమా ? ప్రజల కోసమా ? అనే అంశంపై బుధవారం వేదిక ఫంక్షన్‌ హాల్లో సిపిఎం ఆధ్వర్యాన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వ్యాపారం కోసమే రైతుల వద్ద వేల ఎకరాల భూములు తీసుకున్నారని తెలిపారు.

బహుళజాతి కంపెనీపై తొలి తిరుగుబాటు

ఎత్తయిన గోడలు, చుట్టూ ముళ్ల కంచెలు, ఈగ సైతం లోపలకు వెళ్లలేనంతగా భద్రత... ఇదీ... ఓలం ఆగ్రా ఇండియా లిమిటెడ్‌ (ఒఎఐఎల్‌) బహుళజాతి కంపెనీ విశాఖ జిల్లాలో ఏర్పాటైన ప్రాంతం... అధికారంలో ఉండే రాజకీయ నాయకుల అండదండలు, కార్మిక శాఖ ఉన్నతాధికారుల చల్లని చూపులు రక్షణ కవచాల్లా ఓలం కంపెనీకున్నాయి. ఈ స్థితిలో లోపల ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి. విశాఖ జిల్లాలో శాఖోపశాఖలుగా విస్తరించిన ఓలం జీడిపిక్కల కంపెనీ అన్ని కార్మిక చట్టాలనూ తుంగలో తొక్కుతూ పబ్బం గడుపుకుంటోంది...
90 శాతం మహిళా శ్రామికులే...

ఫాసిస్టు దాడి..

ముంబయిలో రచయిత సుధీంద్ర కులకర్ణిపై శివసేన మూకలు చేసిన దాడి సభ్య సమాజం వేనోళ్ల ఖండించాల్సిన దుర్మార్గ చర్య. మన దేశంలో మతోన్మాద శక్తులు అధికార పీఠాన్ని అధిరోహించిన తరువాత భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పరంపరలో ఇది తాజాది. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్‌ మహ్మద్‌ కసూరి పుస్తకావిష్కరణ సందర్భంగా ఫాసిస్టు మూకలు రెచ్చిపోయి కులకర్ణిపై నల్ల పెయింట్‌తో జరిపిన దాడి మేధో జగత్తును విస్మయానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వంలోను, మహా రాష్ట్ర ప్రభుత్వంలోను బిజెపికి భాగస్వామిగా వున్న శివసేన విద్వేషపూరిత రాజకీయాలకు పేరుమోసింది.

హుదూద్‌ వంచన..

 ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్‌ విలయం సంభవించి సరిగ్గా ఏడాది. ఆ ప్రచండ తుపాను ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితుల సహాయ, పునరావాసాలపై నాడు ప్రభుత్వం గుప్పించిన హామీలపై వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు. వినాశనం నుంచి ప్రజలు స్వంతంగా శక్తినంతా కూడదీసుకొని కుదుట పడ్డారు మినహా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా దక్షత, కొండంత మనసు వలన హుదూద్‌ బాధితుల జీవితాల్లో కాంతులు విరజిమ్మాయంటున్న అనుకూల మీడియా కథనాలు వంచనా శిల్పాలు.

Pages

Subscribe to RSS - October