October

రాజధాని రైతుల సమస్యలపై పోరు

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు.

అరాచకత్వానికి నిదర్శనం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషనర్‌ సుశాంత్‌ రంజన్‌ ఉపాధ్యారు రాజీనామాతో ఆ రాష్ట్రంలో అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు ఆ రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. అధికారం అండతో గూండాలు చెలరేగి పోవడంతో హింస రాజ్యమేలింది. తెగించి పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన సాధారణ ప్రజానీకంపై అమానుష దారుణకాండ చోటు చేసుకుంది. పోలింగ్‌ ప్రక్రియ ఇంతగా అపహాస్యం అయ్యింది కాబట్టే వామపక్ష సంఘటన మూడుచోట్ల రీపోల్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయాల్సి వచ్చింది.

దాద్రి దారుణం..

 మోడీ ప్రభుత్వ అండ చూసుకుని దేశంలో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఢిల్లీకి యాబై కిలోమీటర్ల దూరంలోని దాద్రిలో సాగిన దారుణం కాషాయ మూకల రాక్షసత్వానికి మరో నిదర్శనం. గోవధ జరిగిందన్న తప్పుడు ప్రచారానికి హిందూ ఆలయాన్ని వేదికగా చేసుకోవడం మరీ దుర్మార్గం. గొడ్డు మాంసం తింటున్నాడన్న తప్పుడు ఆరోపణలతో యాభై ఏళ్ల మహ్మద్‌ ఇఖ్లాక్‌ అనే అమాయక ముస్లింను మతోన్మాద శక్తులు పొట్టనపెట్టుకోవడం హేయాతిహేయం. దీనికి కొద్ది రోజుల ముందు కాన్పూర్‌లో ఒక ముస్లింను పాకిస్తానీ ఉగ్రవాది అన్న ముద్ర వేసి ఇలాగే ప్రాణాలు తీశాయి. ముజఫర్‌గర్‌లో ఏ శక్తులైతే ఘర్షణలకు తెగబడ్డాయో అవే శక్తులు దాద్రి ఘటన వెనక వుండడం గమనార్హం.

బెంగాల్లో లెఫ్ట్‌ హవా..

కొల్‌కతా: పురపాలక సంఘ ఎన్నికల్లో పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ కుట్రలు, దౌర్జన్యాలను ఎదిరించి బెంగా ల్‌లోని సిలిగురిలో వామపక్షాలు విజ యభేరీ మోగించాయి. ప్రజలు స్వచ్ఛం దంగా ఓటు వేసిన చోట తృణమూల్‌ పునాదులు కదిలిపోతాయని సిలిగురిలో మరోసారి రుజువైంది. సిలిగురి ఎన్నిక ల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ విజయాన్ని అడ్డుకోవ డానికి అధికార తృణమూల్‌తో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఎన్ని కుయుక్తు లు, కుతంత్రాలు పన్నినా వాటి తరం కాలేదు. సిలిగిరి ముహాకామా పరిషత్‌ లో 9 స్థానాలకు 6 స్థానాలు అంటే 70 శాతం సీట్లు గెలుచుకుని లెఫ్ట్‌ ఫ్రంట్‌ తిరుగులేని విజయం సాధించి ంది.

ఖాకీ కంచెలు

సోలార్‌ పార్కు భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు బుధ వారం అనంతపురం జిల్లా నంబూల పూలకుంట (ఎన్‌పి కుంట) మండలానికి వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ను పోలీసులు అడుగడుగునా అడ్డుకు న్నారు. భూముల వద్దకెళ్లి నిర్వాసిత రైతుల సమస్యలను తెలుసుకోకుండా సిపిఎం నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ మధు పర్యటన సాగింది. ఎన్‌పి కుంట మండలంలో 10,700 ఎకరాల్లో సోలార్క్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,500 ఎకరాల భూములను సేకర ణకు పూనుకున్నారు. ఈ భూములకు సంబంధించి కొందరు బినామీ వ్యక్తులకు పరిహారం

CRDA కార్యాలయం ముట్టడి..

రాజధానిలో పింఛన్ల జాబితాలో అవకతవకలున్నాయనే ఆగ్రహంతో పేదలు తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో మంగళవారం ధర్నాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం పెనుమాక పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. పచ్చచొక్కలోళ్ళకే పింఛన్లు దక్కుతున్నాయని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ అక్కడికి చేరుకున్నారు. అవకతవకలను సరిచేయాలని సర్పంచ్‌ కళ్ళం పానకాలరెడ్డిని కోరారు. అనంతరం ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, కార్యదర్శి పద్మావతి ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.

అనంతపురంలో మధు అరెస్ట్..

అనంతపురం జిల్లాలో సోలార్ హబ్ కోసం NTPC రైతుల వద్ద నుండి పదివేల ఎకరాలను  సేకరిస్తోంది. నష్ట పరిహారం అర్హులైన రైతులకు కాకుండా  బినామీలకు కట్టబెట్టేల అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు.దీనిపై రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.వీరికి అండగా నిలబడిన సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధుని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసారు.. 

హోదాతోనే అభివృద్ధి:పాటూరు

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు.కర్నూలులోని సిపిఎం జిల్లా కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ద్దేశించి పాటూరు మాట్లాడుతూ, రైతాంగం, శ్రమ జీవుల కష్టాలు, నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. విడిపోయే సందర్భంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కావాలని తాము కోరామని, ఈ విషయం గురించి ప్రధాని ఏమీ మాట్లాడడంలేదని చెప్పారు.

Pages

Subscribe to RSS - October