October

గోవధ అంశంపై ముస్లింనేతపై దాడి

జమ్మూ కాశ్మీర్ : ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ పై అధికార కూటమిలోని బీజేపీ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు.శ్రీనగర్ ఎమ్మెల్యేల హాస్టల్ లో రషీద్ కొందరికీ 'బీఫ్' పార్టీ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. గో మాంసంపై నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై రషీద్ పలు వ్యాఖ్యాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి ఆగ్రహానికి గురైన కాషాయ దళం ఆయనపై దాడికి దిగారు. 

కలం యోధుల కలత..

పెచ్చుమీరుతున్న మతతత్వ శక్తుల ఆగడాలపై కలం యోధులు కలత చెందుతున్నారు. కేంద్రం ప్రకటించిన అరుదైన పురస్కారాలను సైతం తిప్పి పంపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నయన తార సెహెగల్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును వెనక్కి పంపగా మరో కవి అశోక్‌ వాజ్‌పేయి కూడా అదే బాటను ఎంచుకున్నారు.

IMF పెదవి విరుపు..

భారత్ ఆర్థిక వృద్ధిరేటు ఆసక్తికరంగానే ఉన్నా.. సంస్కరణల అమలుపై ఐఎంఎఫ్ మరోసారి పెదవి విరిచింది. కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో సంస్కరణలు అమలు జరగటం లేదని పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటును కూడా గత అంచనా కంటే స్వల్పంగా తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై ఐఎంఎఫ్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా కనిపిస్తున్నా.. సంస్కరణలు అమలు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. ముఖ్యంగా నిర్మాణ రంగాల్లో కీలకమైన ఎనర్జీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో రీఫామ్స్ సరిగా జరగడం లేదని పెదవి విరిచింది.

ప్రజా చైతన్యయాత్రలో ఉద్రిక్తత

 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'ను పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎం తప్పు చేశామని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా తాము పాదయాత్ర చేపట్టినట్లు ఇక్కడ ఉన్న కౌలు రౌతుల పరిస్తితి ఏంటీ ? రూ.2500 పెన్షన్ ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు.

రాజధాని రైతుల సమస్యలపై పోరు

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు.

అరాచకత్వానికి నిదర్శనం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషనర్‌ సుశాంత్‌ రంజన్‌ ఉపాధ్యారు రాజీనామాతో ఆ రాష్ట్రంలో అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు ఆ రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. అధికారం అండతో గూండాలు చెలరేగి పోవడంతో హింస రాజ్యమేలింది. తెగించి పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన సాధారణ ప్రజానీకంపై అమానుష దారుణకాండ చోటు చేసుకుంది. పోలింగ్‌ ప్రక్రియ ఇంతగా అపహాస్యం అయ్యింది కాబట్టే వామపక్ష సంఘటన మూడుచోట్ల రీపోల్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయాల్సి వచ్చింది.

దాద్రి దారుణం..

 మోడీ ప్రభుత్వ అండ చూసుకుని దేశంలో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఢిల్లీకి యాబై కిలోమీటర్ల దూరంలోని దాద్రిలో సాగిన దారుణం కాషాయ మూకల రాక్షసత్వానికి మరో నిదర్శనం. గోవధ జరిగిందన్న తప్పుడు ప్రచారానికి హిందూ ఆలయాన్ని వేదికగా చేసుకోవడం మరీ దుర్మార్గం. గొడ్డు మాంసం తింటున్నాడన్న తప్పుడు ఆరోపణలతో యాభై ఏళ్ల మహ్మద్‌ ఇఖ్లాక్‌ అనే అమాయక ముస్లింను మతోన్మాద శక్తులు పొట్టనపెట్టుకోవడం హేయాతిహేయం. దీనికి కొద్ది రోజుల ముందు కాన్పూర్‌లో ఒక ముస్లింను పాకిస్తానీ ఉగ్రవాది అన్న ముద్ర వేసి ఇలాగే ప్రాణాలు తీశాయి. ముజఫర్‌గర్‌లో ఏ శక్తులైతే ఘర్షణలకు తెగబడ్డాయో అవే శక్తులు దాద్రి ఘటన వెనక వుండడం గమనార్హం.

బెంగాల్లో లెఫ్ట్‌ హవా..

కొల్‌కతా: పురపాలక సంఘ ఎన్నికల్లో పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ కుట్రలు, దౌర్జన్యాలను ఎదిరించి బెంగా ల్‌లోని సిలిగురిలో వామపక్షాలు విజ యభేరీ మోగించాయి. ప్రజలు స్వచ్ఛం దంగా ఓటు వేసిన చోట తృణమూల్‌ పునాదులు కదిలిపోతాయని సిలిగురిలో మరోసారి రుజువైంది. సిలిగురి ఎన్నిక ల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ విజయాన్ని అడ్డుకోవ డానికి అధికార తృణమూల్‌తో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఎన్ని కుయుక్తు లు, కుతంత్రాలు పన్నినా వాటి తరం కాలేదు. సిలిగిరి ముహాకామా పరిషత్‌ లో 9 స్థానాలకు 6 స్థానాలు అంటే 70 శాతం సీట్లు గెలుచుకుని లెఫ్ట్‌ ఫ్రంట్‌ తిరుగులేని విజయం సాధించి ంది.

Pages

Subscribe to RSS - October