October

తెలంగాణ ప్లీనంకు ఏచూరి..

ఈ నెల 25, 26, 27 తేదీల్లో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో సిపిఎం రాష్ట్ర ప్లీనం సమావేశాలు నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ప్లీనం జయప్రదం కోసం ఆదివారం నాగార్జున సాగర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగిన తొమ్మిది నెలల తర్వాత జిల్లాలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. సమావేశాల్లో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. పార్టీ నిర్మాణం, రాజకీయ చైతన్యం వంటి అంశాలపైనా చర్చిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

చట్ట సవరణతో బానిసత్వమే:గఫూర్

కేంద్రం సవరించిన చట్టాలు అమల్లోకి వస్తే కార్మికులు బానిసత్వంలో కూరుకుపోతారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు బాలాజీనగర్‌లోని డాక్టర్‌ రామచంద్రారెడ్డి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సిఐటియు జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ వారి నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులనుప్రభుత్వాలు కాలరాస్తు న్నాయని విమర్శించారు. కేంద్రం 5 కార్మిక చట్టాలు చేసింద న్నారు. సమ్మెలు నిషేధించడం, యాజమాన్యానికి అనుకూ లంగా పనిచేయడం, యూని యన్లు పెట్టకుండా నిరోధి ంచడం వంటివి అందులో ప్రధానమైనవని అన్నారు.

ఈనెల 8నుండి సిపిఎం పాదయత్ర..

విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. 

బిజెపి అండతోనే బెంగాల్ లో తృణమూల్‌ అరాచకం

కేంద్రంలోని మతోన్మాద బిజెపి అండతోనే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ అరాచక పాలన సాగిస్తున్నారని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ ప్రజలపై అక్కడి పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు సాగిస్తున్న దాడిని నిరసిస్తూ బీసెంట్‌ రోడ్డులోని మహంతి మార్కెట్‌ సెంటర్లో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నేతృత్వం వహించింది. తొలుత సిపిఎం కార్యాలయమైన సుందరయ్య భవన్‌ నుండి ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

భూములు లాక్కుంటే ఆందోళనే:CPM

రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పేదల భూములు లాక్కొని కార్పొరేట్‌, బహుళజాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తే ఆందోళనలు తప్పవని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు హెచ్చరించారు. శుక్రవారం పాతబస్టాండ్‌లోని సిపిఎం కార్యాలయంలో 'భూ బ్యాంక్‌ బండారం-కార్పోరేట్లకు పందేరం' అనే పుస్తకాన్ని ఆవిష్క రించారు.

120KM చైతన్యయాత్ర:బాబూరావు

అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకు ఆ పార్టీ రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ సీపీఎం కన్వీనర్‌ బాబురావు పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఆ హక్కు లేదు..

బ్రిటిష్‌ ప్రభుత్వం పాలిస్తున్నప్పుడే 1926లో మనదేశ కార్మికవర్గం పోరాడి, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కును సాధించింది. కార్మిక సంఘాలనేవి ఏ దేశంలోనైనా ఉంటాయన్న స్పృహతో బ్రిటిష్‌ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే కార్మిక సంఘాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మాత్రం దారుణంగా వ్యవహరిస్తోంది.కార్మిక సంఘాలు, వామపక్ష ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలపై చంద్రబాబు ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఫార్మా కంపెనీల యజమానులతో జరిగిన సమావేశంలో సంఘాలపైనా, ఉద్యమాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'పాలనంటే బడాబాబులకు సాగిలపడడమా? ప్రజలను, కార్మికులను పట్టించుకోరా?

గురజాడ పఠనమందిరం ప్రారంభం

సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, అందుకు గ్రంథాలయోద్యమం మళ్లీ రావాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద పిలుపునిచ్చారు. విజయవాడ ఆకుల వారి వీధిలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మహాకవి గురజాడ పఠన మందిరాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఎంతటి సమాచారం ఉన్నా అది గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తుం దన్నారు. మహాత్మాగాంధీ నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వరకు గొప్ప నాయకులంతా గ్రంథాలయాల్లోనే ఎక్కువ సమయం గడిపారన్నారు.

Pages

Subscribe to RSS - October