October

స్వచ్ఛ భారత్‌ ఇలాగా!

అయిదేళ్లలో పరిశుభ్ర భారతావని సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీక్షబూని ఏడాది గడుస్తున్న సందర్భంగా మళ్లీ చీపురు కట్టలు పట్టుకుని రాజకీయ నాయకులు, సినీ, సామాజిక రంగ ప్రముఖలు టివీల్లో కనిపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే సీజన్‌లో మనకు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్‌ గురించి నేతలు చెప్పినదానికీ, కింది స్థాయిలో జరిగినదానికీ ఎక్కడా లంగరు కుదరడంలేదనడానికి దేశంలో 70 శాతం మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్న తీరే నిదర్శనం. గ్రామాల సంగతి అటుంచితే నగరాలు, పట్టణాల్లో సైతం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ప్రచారార్భాటంగానే తయారైందన్నది సర్వత్రా వినవస్తున్న మాట.

రహస్య ఒప్పందాలు బయటపెట్టాలి..

రాజధాని నిర్మాణ విషయంలో రహస్య ఒప్పందాలవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సిపిఎం సిఆర్‌డిఏ ఏరియా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు విమర్శించారు.  రాజధాని విషయంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అనుమానాలకు ఊతమిస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత కరువైందని తెలిపారు. పరోక్ష పద్ధతిలో భూములను విదేశీ కంపెనీలకు కట్ట బెట్టాలనే కుట్ర సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకంగా వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.

స్పష్టతలేని భూ కేటాయింపులు

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. తుళ్లూరును రాజధాని ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం పలు హామీలిచ్చింది. అయితే అమలులో మాత్రం చతికిలపడింది. భూములిచ్చిన రైతులకు పరిహారం ప్యాకేజి కింద అభివృద్ధి చేసిన భూములను ఎక్కడ కేటాయిస్తారనేది ఇప్పటికీ స్పష్టతివ్వలేదు. భూమిలేని నిరుపేదలకు పింఛను ఇస్తామన్నారు. 23,500 మంది నిరుపేదలున్నట్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం తరువాత వివిధ రూపాల్లో వడపోత చేపట్టి గురువారం వరకూ 13,019 మందికి ఫించన్లు అందించింది.

నేతిబీరలో నెయ్యి - కార్పొరేట్‌ సామాజిక భద్రత

సమాజంలో నెలకొని ఉన్న అంతరాలను రూపుమాపే లక్ష్యం తోనే 'సామాజిక బాధ్యత' అనే అం శం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చాల్సింది అధికారం లో ఉన్న పాలకవర్గాలే. దాని కోసమే 'సంక్షేమ రాజ్యం' అనే భావన వాడుకలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బాధ్యతల నుంచి ప్రభు త్వాలు వైదొలగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కార్పొరేట్‌ సంస్థలకు ఆ బాధ్యతలను బదలాయిస్తున్నాయి. ఈ మార్పిడి సత్ఫలితా లనిస్తుందని పాలకవర్గాలు ఆశిస్తున్నాయి.

కాయకల్ప చికిత్స..

రెపో రేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయని చాలామంది ఆశిస్తున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించడంతో పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ కూడా ఈ దిశలోనే స్పందించింది. బుధవారం ఉదయం నుండి ఏ మాత్రం తడబాటు లేకుండా మార్కెట్‌ సూచీ పైకే ప్రయాణం చేయడం రిజర్వు బ్యాంకు నిర్ణయానికి సానుకూల స్పందనే! అయితే, అరశాతం రెపో రేటు తగ్గిచడంతోనే బ్రహ్మాండం బద్దలవుతుందని భావించడం సబబుకాదు. ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి.

పెంచినజీతాలఅమలుఏదీ?:CITU

పెంచిన జీతాలు, ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల మున్సిపల్‌ కార్మి కులు ధర్నాలు నిర్వహించారు. విశాఖలో జివిఎంసి కార్యా లయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.11వేలు అమలు చేయాలని, ప్రతి నెలా 5వ తేదీకే వేతనాలు చెల్లించాలని, గుర్తింపు యూనియన్‌ 41 ప్యాకేజీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు.

కార్మికహేళన పాలన:నర్సింగరావు

 విశాఖ జిల్లాలోని పలు ప్రయివేటు పరిశ్రమల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. నర్సింగరావు విమర్శించారు. తెలుగుదేశం పాలన పూర్తిగా కార్మిక హేళనకు మచ్చుతునకగా ఉందని అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 28న గంగవరం పోర్టులోనూ, పరవాడ ఫార్మాసిటీ సాయినార్‌ కంపెనీల్లోనూ ప్రమాదాలు జరిగి ముగ్గురు కార్మికులు మరణించారని తెలిపారు.

APకి ప్రత్యేక హోదా ఇవ్వాలి:CPM

రాయలసీమ అభివృద్ధికి రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లాలో చేపట్టిన సిపిఎం జీపుజాతా బుధవారం నంద్యాల, గాజులపల్లె, మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో బిజెపి అగ్రనాయకులు వెంకయ్యనాయుడు ఎపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా గురించి పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.

దేశంలోఫాసిస్టుపోకడలు:MAబేబీ

భారతదేశంలో ఉన్నది పాసిస్టు ప్రభుత్వం కాకపోయినా పాసిస్టు పోకడలు కనిపిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆలిండియా విప్స్‌ సదస్సులో పాల్గొనటానికి విశాఖ వచ్చిన బేబీ బుధవారం సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అగ్రవర్ణాల సహకారంతో బడుగు, బలహీన వర్గాలను అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు.

ప్రత్యేకసబ్‌ప్లాన్‌ ఏది?జమలయ్య

ప్రభుత్వం చేనేత పార్కులను ఏర్పాటు చేసి చేనేత కార్మి కులకు ఉపాధి కల్పించాలని ఎపి చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఎపి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కార్యదర్శి జెఎన్‌ శేషయ్య అధ్యక్షత జరిగిన ధర్నాలో జమలయ్యతోపాటు, కార్మికుల ఆందోళనకు మద్దతు పలుకు తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్‌ కూడా మాట్లా డారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. జిల్లాలో 15 వేలకు మందికిపైగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని తెలిపారు.

Pages

Subscribe to RSS - October