ఆర్టికల్స్

ఆత్మహత్యల 'భారతం'

 భాతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో ఆత్మహత్యలు ప్రధానంగా ముందుకు రావడం ఆందోళన కలిగించే విషయం. పలు కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు సంవత్సరానికి లక్షకు మించి పోవడం కలచివేసే అంశం. కొన్నేళ్లుగా ఆత్మహత్యల పరంపర కొనసాగడంపై ఏలికలు తేలిగ్గా తీసుకోవడం దారుణం. ఏదైనా ప్రమాదంలోనో, హఠాత్తుగా సంభవించే అనారోగ్యంతోనో చనిపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ జీవితంలో సమస్యలు ఎదుర్కోలేక కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం బాధాకరం కాగా, అలాంటి వారు వేలు దాటి లక్షలకు చేరడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజాగా 2014కు సంబంధించి విడుదల చేసిన ఆత్మహత్యల వివరాలు ప్రజలను విస్మయపరుస్తున్నాయి. నిరుడు...

ఐరోపా అసలు స్వరూపం..

 గ్రీకు ప్రజలు కేవలం ఒక వారం క్రితం రిఫరెండంలో తిరస్క రించిన 'పొదుపు ప్యాకేజీ'ని ప్రధాని అలెక్సీ సిప్రాస్‌ అంగీకరిం చటమంటే గ్రీక్‌ ప్రభుత్వం లొంగిపోవ టమే. గ్రీకు ప్రజలంటే జర్మన్‌ ద్రవ్య పెట్టుబడికున్న చిన్నచూపుకు ఇది ఒక సూచిక. వాస్తవంలో ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికి ఇది ఒక నిర్ణయాత్మకమైన మలుపు. వామపక్షాల ముఖ్యంగా యూరోపియన్‌ వామపక్షాల ఆలోచనా ధోరణికి ఇది ఒక ముగింపు. గ్రీస్‌ ప్రధాని అలెక్సీ సిప్రాస్‌ షరతులను అంగీకరించటమా, లేదా అనేది అసలు విషయం కాదు. యూరోపియన్‌ వామపక్షాలు తమను తాము పరిమితం చేసుకున్న వ్యవహార శైలిలో సిప్రాస్‌కు అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదు. దాని మాటునగల భావన లోపభూయిష్టమైనదని సిరిజా లొంగుబాటు తెలియజేస్తున్నది. ఇది సిరిజాను...

స్వచ్ఛ భారత్‌లో స్కాంల పర్వం..

ఇటీవల వెలుగులోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుంభకోణాలు బిజెపిని బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న భారీ వ్యాపం కుంభకోణం, లలిత్‌మోడీ కుంభకోణం, శృతి ఇరానీ లాంటి వారి విద్యార్హతలకు సంబంధించిన సమస్యలు బిజెపికి గుబులుపుట్టిస్తున్నాయి. బిజెపి నేతలు కుంభకోణాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అవినీతిలేని పాలన అందిస్తామని బిజెపి నాయకులు ఊదరగొట్టారు. కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. వ్యాపం స్కామ్‌లో ఆ పార్టీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు భాగస్వామ్యం ఉందంటూ వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్‌ వృత్తి పరీక్షల బోర్డు ద్వారా ప్రభుత్వోద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో పెద్ద...

చట్టాలన్నీ పెళుసు...పాలకులకు పేదలంటే అలుసు

మన చట్టాలన్నీ పెళుసుబారాయి. పాలకులే వాటిని అమలు చేయని నిందితుల జాబితాలోకి చేరుతున్నారు. చట్టాలు చేసే వారే అమలుకు మీనమేషాలు లెక్కించడం విచిత్రం. అందునా పేదలకు సాయం అందించే చట్టాలంటే వారికి మరీ అలుసు! తాజాగా మున్సిపల్‌ కార్మికుల ఆందోళనే అందుకు ఉదాహరణ. మున్సిపల్‌ కార్మికుల్లో 85 శాతం మంది దళిత, గిరిజన పేదలే! వీరు పట్టణాల్లో మురికి, చెత్త, మలిన పదార్థాలను చేతులతో తీస్తూ వెట్టిచాకిరి చేస్తున్నారు. పాకీ పనితో నిజమైన 'స్వచ్ఛ భారత్‌'ను అమలు చేస్తున్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండేందుకు పనిచేసే ఆ కార్మికులు మాత్రం దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనాలు చాలక పస్తులతో కునారిల్లుతున్నారు. తమ పిల్లలను పోటీ ప్రపంచంలో పెద్ద...

అడవులూ మింగేస్తారా !

రాష్ట్ర రాజధానిని నిర్మించడం కోసం ఈ సరికే 30 వేలకు పైగా ఎకరాల పంట భూములు సేకరించిన ప్రభుత్వం తాజాగా పేదలు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై డేగ కన్నేయడం అమానుషం. భూములను సొంతం చేసుకోవడానికి వీలుగా అడవులను డీనోటిఫై చేయడమే కాక లక్ష ఎకరాలను కార్పొరేట్లకు, పెట్టుబడి దారులకు, ప్రభుత్వ అనుకూల పెద్దలకు పందేరం చేయ పూనుకోవడం దాని వర్గనైజాన్ని తెలియజేస్తోంది. అనేక కష్టాలకోర్చి అటవీ భూమిని సాగుకు అనువుగా మార్చిన రైతన్న పొట్ట కొట్టే కుట్రలు పన్నడం దుర్మార్గపూరితం. రాజధాని ముసుగులో పచ్చటి పంట పొలాలు దారాదత్తం చేయడానికి పాల్పడిన పాలకులు ఇప్పుడు ఏకంగా రాజధాని ప్రాంతంలోని అరవై శాతం అడవిని ధ్వంసం చేయ చూడడం దురదృష్టకరం. దీనికోసం చంద్రబాబు సర్కారు నిబంధనలను...

భూ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే..

                     దీర్ఘకాలం నుంచి అమల్లో ఉన్న భూ సేకరణ చట్టం-1894 స్థానంలో సక్రమ నష్టపరిహారానికి గల హక్కు, భూ సేకరణలో పారదర్శకత, పునరావాసం చట్టం-2013 (ఎల్‌ఎఆర్‌ఆర్‌ 2013)ను తెచ్చారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, గ్రామీణ పేదలు, సంబంధిత వ్యక్తులు అందరూ సవివరంగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం ఏకాభిప్రాయంతో ఈ చట్ట తెచ్చారు. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ రైతులు, భూమిపై ఆధారపడిన వారికి కొంతమేరకు రక్షణ కల్పించేలా, దేశ ఆహార భద్రతా ఆందోళనలను పరిష్కరించేలా ఎల్‌ఎఆర్‌ఆర్‌-2013 లో నిర్దిష్ట సూత్రాలు, నిబంధనలు పొందుపరిచారు. కానీ, ఇప్పుడు కొత్త చట్టంలో ప్రతిపాదించిన సవరణలు వీటిల్లోని...

బాల్యాన్నిబలిచేసే చట్ట సవరణ!

కేంద్రంలోని బిజెపి/ఎన్‌డిఎ ప్రభుత్వం బాలల హక్కులను హరించేందుకూ సమాయత్తమైంది. బాలకార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం 1986కు కొన్ని సవరణలు చేయటానికి మే 13న కేబినెట్‌ సమావేశం తీర్మానించింది. ఆ మేరకు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లుపెట్టే అవకాశం ఉంది. ప్రతిపాదిత సవరణలలో బాల్యాన్ని బలిచేసే అంశాలు రెండు ఉన్నాయి. వాటిని పార్లమెంటు ఆమోదిస్తే... ఒకటి, కార్పొరేట్‌ కంపెనీలు, ఫ్యాక్టరీలకు కార్మికులు చౌకగా లభించే 'స'దవకాశం ఏర్పడుతుంది. రెండు, కుల వృత్తుల పేరుతో వర్ణ వ్యవస్థకు, మనుధర్మ శాస్త్రానికి మళ్లీ జీవం పోసినట్లు అవుతుంది.
18 సంవత్సరాల వయస్సు వరకూ బాలలుగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల అంతర్జాతీయ సదస్సు ఆదేశించింది. దానికి...

మున్సిపల్‌ సమ్మె విచ్ఛిన్నానికి సర్కారు కుట్రలు

 మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల సమ్మె గురువారానికి ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పోరాటం ఉధృత రూపం దాలుస్తోంది. అయితే సమ్మె డిమాండ్లు పరిష్కరించి, సమ్మెను నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి, మున్సిపల్‌ శాఖా మంత్రి డాక్టర్‌ నారాయణకు 'రాజమండ్రి పుష్కరాలు' లేదంటే జపాన్‌, సింగపూర్‌ల పర్యటనలకే కాలం సరిపోతుంది తప్ప, వేలాది దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల ఆకలి కేకలు పట్టించుకునే తీరికలో లేరు. నగరాలు, పట్టణాలన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి. మరోవైపు వర్షాలు తోడవడంతో పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితిలో ''ప్రపంచ...

పున:పరిశీలించండి!

భూ సేకరణ చట్ట సవరణపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నిర్వహించిన నీతి ఆయోగ్‌ భేటీకి అధికశాతం ముఖ్యమంత్రులు మొహం చాటేయడం, ఆ చట్టం పట్ల దేశంలో ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. చట్ట సవరణపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ సిఎంలు, కాంగ్రెస్‌, బిజెపియేతర సిఎంలతో పాటు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన పంజాబ్‌ అకాలీదళ్‌ సిఎం కూడా చట్ట సవరణను తోసిపుచ్చడం బిజెపికి మింగుడుపడని విషయం. జమ్మూకాశ్మీర్‌లో బిజెపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పిడిపి సిఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ సైతం భూ సేకరణ చట్ట సవరణను అంగీకరించలేదంటే బిజెపి తన వైఖరిని పునఃపరిశీలన చేసుకోవడం అవసరం. నీతి ఆయోగ్‌ సమావేశానికి...

మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రజాస్వామ్యీకరించాలి

 ''స్వామ్యం అంటే పరిపాలన. మన ప్రాచీన రాజనీతి శాస్త్ర గ్రంథాలలో ఈ కారణం చేత రాజుకు ''స్వామి'' అనే పేరు పెట్టబడింది. పరిపాలనలో అధికారాన్ని వహించే మంత్రులను, వివిధ శాఖల అధ్యక్షులను, ఉన్నత ఉద్యోగి వర్గాన్ని అతడు నియమించేవాడు. వారు అతనికి లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూండేవారు. అందుచేత ''స్వామ్యం'' అతనిదిగా ఉండేది. అతనిపై అధికారాన్ని వహించే వారెవరూ ఉండేవారు కారు. ఈ కారణంగా రాజు నిరంకుశుడయ్యాడు. ప్రజలను పీడించుకుతిన్నాడు. అంత్ణపుర కలహాలతో, యుద్ధాలతో, విలాసాలతో ప్రజా సంక్షేమాన్ని మరచి పాలించాడు.
ప్రజాస్వామ్యంలో స్వామ్యం ప్రజలది. పరిపాలనా రంగంలో ప్రధానాధికారాలను వహించేవారిని ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నుకుంటారు. వీరెవరూ...

ప్రజాతీర్పు వమ్ము

 గ్రీసులో చోటుచేసుకున్న తాజా పరిణామాలు వంచనాశిల్ప కళను పరాకాష్టకు తీసుకుపోయాయి. ఏ ఆర్థిక సంస్కరణలు తమ జీవితాలను అతలాకుతలం చేస్తాయని అక్కడి ప్రజానీకం భావించిందో ఆ నరకకూపం వైపే తమ ప్రజలను నడిపించడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధపడిన తీరు దిగ్భ్రాంతికరం. ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా నో అంటూ గ్రీసు ప్రజానీకం ఇచ్చిన తీర్పును అక్కడి పాలకపక్షం తారుమారు చేస్తున్న తీరు దిగజారుడుతనానికి నిలువెత్తు నిదర్శనం. నిరుపేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకు పంచిపెట్టే విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకమంతా ఏకతాటిపై నిలిచిన తరువాత కూడా ఇంత లొంగుబాటు ప్రదర్శించడం దారుణం. ఏ విధానాలనైతే ప్రజలు తిరస్కరించారో అవే సంక్షోభానికి పరిష్కార మార్గాలుగా ప్రధానమంత్రి అలెక్సిస్‌...

మరో 'థర్మల్‌' కుంపటి

 'మాకొద్దీ తెల్లదొరతనం/ దేవా, మా ప్రాణాలను త్రుంచి/మా మానాలను హరియించే/మాకొద్దీ తెల్ల దొరతనం' అన్న ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ పుట్టిన గడ్డ మీదే జపాన్‌ కంపెనీ సుమిటోమి సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సిక్కోలు భూమి, ఆస్ట్రేలియా బొగ్గు, జపాన్‌ వారి శాస్త్ర సాంకేతికతతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలను అభివృద్ధి చేస్తుందట! ఇప్పటికే సోంపేట, కాకరాపల్లిలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గత ప్రభుత్వం ముగ్గురేసి చొప్పున ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. అయినా, పాలకులు వెనక్కి తగ్గడం లేదు. ఆరు థర్మల్‌ ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాలో పెట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటికి తోడు 'అణు...

Pages