ఆర్టికల్స్

కలం గళమై గర్జించిన 'గరిమెళ్ల'

అభ్యుదయ భావజాలంతో దేశభక్తిని చాటుతూ బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర నుంచి ఎగసి పడ్డ కవి కెరటం గరిమెళ్ల.. 1892 జులై 15న నాటి కళింగాంధ్ర (నేడు ఉత్తరాంధ్ర) ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం ప్రియాగ్రహారంలో సూరమ్మ, వెంకట నరసయ్యకు జన్మించారు. ప్రజాకవి, జాతీయ కవి సార్వభౌమ బిరుదాకింతుడైన గరిమెళ్ల కలం గళమై బ్రిటిష్‌ సామ్రాజ్యపు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. పాత్రికేయ వృత్తిని దేశ హితం కోసం, పరపీడన నుంచి జాతి విముక్తి కోసం అనేక రచనలు సాగించారు. ఉపాధ్యాయుడిగా, గేయరచయితగా, స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని 'మా కొద్దీ తెల్లదొరతనం' గేయంతో ఖ్యాతి గడించారు. 39 చరణాలతో అప్పట్లో ఈ గేయం జనం హృదయాలను తాకి,...

ప్రాణాంతక నిర్లక్ష్యం..

మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చోటుచేసుకున్న మహా విషాదం ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. దీనిని వర్ణించడానికి మాటలు చాలవు. సర్కారీ నిర్లక్ష్యానికి రెండు డజన్లకు పైగా నిండు ప్రాణాలు గోదారిలో కలిసిపోయాయి. మృతులలో ఎక్కువ మంది మహిళలే. మరో 30 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సర్కార్‌ అనుసరించిన దారుణ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఈ తొక్కిసలాట. ప్రతి పన్నెండేళ్లకొకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో కనీవిని ఎరుగని ఘోరమిది. చంద్రబాబు ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే ఈ మహా విషాదం నివారించబడేది. క్షతగాత్రుల హాహాకారాలు, మృతుల కుటుంబాల...

ఆధ్యాత్మికత-అసలు, నకిలీ

 ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటే హడావిడి. పుష్కరాలకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటిలో ఏవీ శాశ్వత నిర్మాణాలు కావు. కేవలం 12 రోజులకు తప్ప తరువాత పనికిరానివి. అసలు అప్పటిదాకా కూడా అవి ఉంటాయా అన్నది కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అలవిమాలిన అవినీతి, యథావిధిగా బాధ్యతారాహిత్యం సరే. అవి మన సనాతన సంప్రదాయాలలో భాగంగా ఎప్పుడో మారిపోయాయి కాబట్టి విశేషంగా చెప్పుకోవలసిన అవసరం లేకుండవచ్చు. ఇక రెండు ప్రభుత్వాలూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే ప్రభుత్వాలే అజ్ఞానాన్ని పెంపొందించి మూఢనమ్మకాలను పెంచడానికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయా అనిపిస్తుంది. పుష్కర స్నానం చేయండి, ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి, కోరిన కోర్కెలు తీర్చుకోవడానికి పుష్కర...

ప్రభుత్వ హత్యలే..

ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి. 
రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేసినా ప్రజలు రాజమండ్రికి పెద్ద ఎత్తున తరలి వస్తారని ప్రభుత్వానికి తెలుసు....

గ్రామీణ భారతపు ఘోర పరిస్థితి

భారత ప్రభుత్వం 'సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఇసిసి) -2011'ను జులై 3వ తేదీన విడుదలచేసింది. గ్రామీణ భారత దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఈ సర్వేలోని వివరాలు తేటతెల్లం చేశాయి. ఈ సర్వేలోని సమాచారంపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనటంలో సందేహం లేదు. ఈ గణన వెల్లడించిన అనేక వాస్తవాలలో ఒకే ఒక దాని విశ్లేషణకు నేను పరిమిత మౌతాను. అదేమంటే గ్రామీణ భారతదేశంలోని మొత్తం కుటుంబాలలో రోజు కూలీ(కాజువల్‌ లేబర్‌)పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎంత నిష్పత్తిలో ఉన్నాయనేది.
               యావత్తు గ్రామీణ భారతదేశంలో సర్వే చేసిన 17.91 కోట్ల కుటుంబాలలో 9.16 కోట్ల కుటుంబాలు లేక 51.14 శాతం కుటుంబాలు రోజు...

డిమాండ్లపై కెవిపిఎస్‌ ఉద్యమం

 భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపర్చడం వల్ల దళితులు ఉద్యోగాలు పొంది కొంతవరకైనా అభివృద్ధి అవుతున్నారు. దీన్ని కూడా అగ్రకుల దురహంకారులు ఓర్వలేక పోతున్నారు. ఇంకెన్నాళ్లు రిజర్వేషన్లు, తీసేయమని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందని అంటున్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలుచేయబోమని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు ముక్తకంఠంలో చెబుతున్నాయి. కానీ పాలకులు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కల్గిస్తోంది.
             దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు కావస్తోంది. ఒక ప్రక్క నాగరికత ఎంత గా అభివృద్ధి...

కరువు చర్యలేవీ?

ఆదిలోనే హంసపాదులా ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం తీవ్రరూపం దాల్చడం ఆందోళనకరం. నిరుటి కరువు, తుపాను ప్రకృతి బీభత్సాలకు నష్టాలపాలైన రైతుల్లో ఈ ఏడాది సకాలంలో నైరుతీ రుతుపవనాల రాక వలన తొలకరి ఆశలు చిగురించాయి. కాగా జూన్‌ మొదటి మూడు వారాల్లో మురిపించిన వర్షాలు అనంతరం మొరాయించి అన్నదాతల ఆనందాన్ని ఆవిరి చేశాయి. ఇరవై రోజులకు పైగా చినుకు కరువై వర్షాకాలంలో ఎండాకాలంలా తయారైంది. అసాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు ఎగబాకడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖరీఫ్‌ సాగు పడకేసింది. వానల కోసం రైతన్నలు మబ్బుల వంక ఎదురు చూస్తున్న విపత్కర పరిస్థితి. పదమూడు జిల్లాల నవ్యాంధ్రలో ఆరు జిల్లాలు అనావృష్టితో అల్లాడుతున్నాయి. సీజను ఆరంభంలో కురిసిన వర్షాల వల్ల...

ఆర్థిక అసమానతలు

ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్‌సీస్‌ డిపార్ట్‌మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు. 
               ఐఎమ్‌ఎఫ్‌ తన నివేదికలో ''ప్రపంచ ఆర్థికమాంద్యం 2009 తరువాత, ప్రస్తుత వార్షిక సంవత్స రంలో ఆర్థిక వృద్ధిరేటు అతి తక్కువగా నమోదవుతుంది'' అని పేర్కొంది. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఊహించిన 3.5 శాతం వృద్ధిరేటుకన్నా 3.3 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అభిప్రాయపడింది. ఒకవైపు చైనా స్టాక్‌మార్కెట్‌ అలజడులు, గ్రీసు రుణభారాలు ఈ సంవత్సరపు...

వ్యసనం

వలదు వలదన్న వాటికే మనుషులు అలవాటు పడతారు. కాదు కాదన్న వాటి చెంతకే  చేరుతారు. నిషేధిత పనుల మీదనే మనుషులకు ఆకర్షణ ఎక్కువ. సమాజం ఒప్పని పనులు చేయకూడదని తెలిసినా వాటి వైపే మొగ్గు చూపుతారు. తప్పని తెలిసినా వాటికి లొంగిపోతారు. అలవాటు అన్నది వదిలిపెట్టడానికి వీల్లేనంతగా పరిణమిస్తే వ్యసనమవుతుంది. ఆ వ్యసనానికి బానిసలయితే కోలు కోవడం కష్టం. అందువల్లనే మన పెద్దలు సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం క్షేమకరమని చెప్పారు. పురాణాలు, శాస్త్రాలు చెప్పిన ఈ ఏడు వ్యసనాల్లో జూదం, మాంసభక్షణం, మద్యపానం, వేశ్యాసంగమం, వేట, దొంగ తనం, పరస్త్రీలపై లౌల్యం ఉన్నాయి. ఇవే గాక ఇతరులు మరికొన్ని వ్యసనాల గురించి ప్రస్తావించారు. ఈర్ష్య, అసూయ, కోపం వంటి అవలక్షణాలతో తరచుగా కోపావేశాల్ని...

రమ్స్‌ఫెల్డ్‌కు జ్ఞానోదయం

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ నిర్దేశానుసారం ఇరాక్‌పై దాడి చేయటం ద్వారా చాలా పెద్ద పొరపాటు జరిగిందని అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రమ్సఫెల్డ్‌ కథనం. 2003లో ఇరాక్‌పై దాడికి ఈ రమ్స్‌ఫెల్డే నాయకత్వం వహించారు. ఇన్నాళ్ళ తరవాత బహిరంగంగా ఇరాక్‌లో అమెరికా చెప్పిన ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టింప జేయటానికి బుష్‌గారి నిర్డేశాను సారం యుద్ధం మొదలబెట్టటం పూర్తిగా తప్పని ఆయన ప్రకటిం చారు. ఇరాక్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నెలకొల్పాలనే పేరిట అక్కడి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అధికారం నుంచి తొలగించి హత్య చేయటం అర్థం లేని, గందరగోళ చర్యని అన్నారు. లండన్‌ నుంచి వెలువడే 'ద టైమ్స్‌' పత్రికకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో 'నేనొక్కడినే కాదు, అమెరికా...

మన విద్యారంగం పయనమెటు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే కాదు, ఏదేశమేగినా ఎందు కాలిడినా మన రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు. అభివృద్ధి గురించి ఆయన చెప్పే విషయాలు పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా చదువుతున్నాం. టీవీల్లో గంటల తరబడి వింటున్నాం. అభివృద్ధి అనగానే ఆయన చెప్పేది సింగపూర్‌, జపాన్‌ల గురించి. ఈ మధ్య చైనా గురించి కూడా చెబుతున్నారు. మన రాష్ట్రాన్ని సింగపూర్‌లాగా, జపాన్‌, చైనాల్లాగా అభివృద్ధి చెస్తాననే ముందు ఏ జాతి అయినా అభివృద్ధి చెందడానికి అతి ముఖ్యమైన, కీలకమైన రంగం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యాభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికీ, పేదరిక నిర్మూలనకూ అత్యంత కీలక విషయం. విద్యాభివృద్ధి జరక్కుండా ఏ దేశమూ, జాతీ అభివృద్ధి కాలేదు. సింగపూర్...

అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు

 ప్రపంచ ఆర్థిక సంకోభ ధాటి నుండి ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థను రక్షించడం కోసం బాసెల్‌ 3 ప్రమాణాలు రూపకల్పన చేయబడ్డాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించిన కారణంగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ 1-4-2013 నుండి భారత దేశంలోని జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు బేసెల్‌ 3 ప్రమాణాలను అమలుచేయాలని అదేశించింది. ఈ ప్రమాణాల అమలుతో బ్యాం కుల పరిరక్షణ ఎలాగున్నా, అదనపు మూలధన సమీకరణలో జాతీయ బ్యాంకులు జీవన్మరణ పోరాటం జరుపుతూ, అంతిమంగా ప్రైవేటీ కరణ దిశగా అడుగులు వేయాల్సిన దుర్భర పరిస్థితులను నరేంద్రమోడీ నాయకత్వంలోని యన్‌డిఎ ప్రభుత్వం కల్పిస్తున్నది.
బేసెల్‌ ప్రమాణాల నేపథ్యం :
నయా ఉదారవాద...

Pages