ఆర్టికల్స్

బహుళజాతి సంస్థల సామ్రాజ్యానికి బాటలు

 ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌ (టిటిఐపి) ఒప్పందంపై అమెరికా, ఐరోపా యూనియన్‌ (ఇయు) మధ్య చర్చలు జరుగు తున్నాయి. ఈ ఒప్పందాన్ని ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) ఒప్పందానికి అనుబంధ ఒప్పందంగా అమెరికా పరిగ ణిస్తున్నది. దుస్తులు, రసాయనాలు, మందులు, కాస్మటిక్స్‌, వైద్య పరికరాలు, కార్లు, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, యంత్రాలు, ఇంజనీరింగ్‌, క్రిమి సంహారకాలు, శానిటరీ అండ్‌ ఫైటో శానిటరీ మెజర్స్‌, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, తదితరాల వాణిజ్యంలో ఆటంకాలను తొలగించటం, ఇంధన, ముడి పదార్థాలు, వర్తకం, సుస్థిర అభివృద్ధి, శ్రమ, పర్యావరణం, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి, పోటీ విధానం, తదితర అనేక అంశాలపై...

దేశానికి చేటు..

కేంద్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) కిటికీలు తెరవగా ప్రస్తుత బిజెపి సర్కారు తలుపులు బార్లా తెరిచి కాంగ్రెస్‌ కంటే 'విభిన్నత'ను చాటుకుంది. గతేడాది నవంబర్‌లో కొన్ని కీలక రంగాల్లోకి ఎఫ్‌డిఐలను స్వేచ్ఛగా ఆహ్వానిస్తూ మోడీ ప్రభుత్వం తీర్మానించగా తాజాగా సోమవారంనాడు ఆదరాబాదరగా ప్రధాని ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై ఎఫ్‌డిఐలకు మరింతగా ద్వారాలు వెడల్పు చేసింది. ఈ దెబ్బతో అదీ ఇదీ అనే తేడా లేకుండా దేశంలోని దాదాపు అన్ని రంగాల్లోకీ ఎఫ్‌డిఐలు చొరబడేందుకు ఆస్కారం కల్పించింది. ప్రపంచంలోనే అత్యధిక బహిరంగ మార్కెట్‌ కలిగిన దేశంగా భారత్‌ను అంగట్లో నిలిపింది. కీలకమైన రక్షణ రంగం సహా ఔషధ, పౌర విమానయానం,...

ఉగ్రవాదం ఏదైనా బలయ్యేది అమాయకులే...

సామాజిక అంతర్జా లం లో 2016 మే 14న ఒక వీడియో దుమారం రేపింది. అయోధ్యలో బజరంగ్‌దళ్‌ శిక్షణా శిబిరంలో భాగంగా సభ్యులకు మరణాయుధాలు వాడటంలో శిక్షణ ఇస్తున్నారు. వారి ఉద్దేశం దేశంలో ముస్లిం తీవ్రవాదులను ఎదుర్కోవడం, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడమట! ఆ పనులు చేయడానికి మనం పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పర్చుకున్నామని వారు మర్చి పోయారా? అదే నెల 30న విహెచ్‌పి మహిళా శాఖ 'దుర్గావాహిని' తన సభ్యులకు మారణాయుధాలలో సైనిక శిబిరం లాంటి శిక్షణ ఇస్తుందని వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ఆత్మరక్షణ కోసం శిక్షణ ప్రతి స్త్రీకీ అవసరమైనప్పటికీ మారణాయుధాలతో శిక్షణ వారికి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? జూన్‌ 2న మథురలో ఒక నమ్మశక్యం కాని హింసాత్మక ఉదంతంలో ఆజాద్‌ విధిక్‌...

దళితులు - భూమి - అంబేద్కర్‌

డాక్టర్‌ బిఆర్‌ అంబే ద్కర్‌ ప్రధానంగా ఆర్థిక శాస్త్రవేత.్త 1915లో కొలంబి యా యూనివర్సిటీలో 'ప్రాచీన భారత వాణిజ్యం'పై పరిశోధ నా పత్రాన్ని సమర్పించి ఎంఎ డిగ్రీని పొందారు. ఆయన అత్యంత శ్రమతో పరిశోధించిన 'నేషనల్‌ డివిడెండ్స్‌ ఆఫ్‌ ఇండియా' అనే పరిశోధనా గ్రంథాన్ని 1916 జూన్‌లో పిహెచ్‌డి కోసం కొలంబియా యూనివర్సిటీకి సమర్పించారు. ఈ గ్రంథం 'ది ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రిన్సిపుల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటిష్‌ ఇండియా' అనే పేరు మీద ప్రకటించబడింది. తరువాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్సులో 1916 జూన్‌లో చేరారు. ఈ డిగ్రీలో ఎక్కువ భారత ఆర్థిక వాణిజ్య శాస్త్రాలకు సంబంధించినవి కావడం వల్ల భారతదేశంలో ఆయన ఆర్థికంగా ప్రతిపాదించిన అంశాలు చాలా...

కార్పోరేట్‌ వైద్యానికి ప్రజలను బలిపశువులుగా మారుస్తున్న ప్రభుత్వాలు

అందరికీ ఆరోగ్యం అన్న నినాదం విశ్వసార్వ జనీతకు అద్దంపడుతున్నప్పటికీ మన దేశంలో ప్రజారోగ్యం జాతీయ ఆరోగ్య విధానప్రకటనకు విరుద్దంగా ప్రవేటీకరణ దిశగాపయనించడం ఆందోళన కలిగిస్తున్నది. దేశ ప్రజల్లో మధ్య తరగతి, పేద ప్రజలు 85శాతం మందిదాకా వున్నారు. పేద ప్రజల ప్రధాన ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండటం వల్ల ప్రభుత్వరంగంలో నిర్వహించబడుతున్న ఆసుపత్రులకు కార్పెరేట్‌ వైద్యం పెను సవాలుగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతో పాటు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యతగా, ప్రాథమిక విధిగా పరిగణించవలసివుందని భారత రాజ్యంగంలోని నాలుగవ భాగం ఉద్ఘాటిస్తుంది. రాజ్యంగ నిబంధనలు - విధులను పరిగణలోకి తీసుకోవాల్సిన పాలకులు వైద్య ఆరోగ్యరంగాన్ని...

ప్రజారోగ్యంలో మేటి క్యూబా

క్యూబాలో ప్రజారోగ్యం అగ్రరాజ్యా లను తలదన్నే విధంగా ఉంది. 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రాధాన్యతల్లో ఆరోగ్యానికి అగ్రస్థానం ఇచ్చింది. రాజ్యాంగంలో ఉన్న 'ఆరోగ్య హక్కు' అక్షరాలా అమలవుతున్నది. ప్రపంచ దేశాలు క్యూబాలోని ప్రజారోగ్యాన్ని ఒక ఆదర్శంగా భావిస్తున్నాయి. క్యూబాలోని ఆరోగ్య వ్యవస్థను శత్రువులైనా, మిత్రులైనా కొనియాడక తప్పడంలేదు. 1.5 కోట్ల జనాభా కలిగిన క్యూబా దేశం ఆరోగ్యంలో గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నది. 1959 క్యూబా విప్లవం జయప్రదం అయినప్పటి నుంచి ''సార్వత్రిక ఆరోగ్య రక్షణ'' ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత పథకంగా సోషలిస్టు క్యూబాలో అమలు జరుగుతున్నది. ప్రతి ఒక్కరికీ కుటుంబ డాక్టరు అందుబాటులో ఉంటారు....

వాగ్దానం చేసిన ఉద్యోగాలెక్కడ

దేశంలో నిరుద్యోగం పెరుగుదల, ఉద్యోగాలు పెరగక పోవటాన్ని గురించి ఈమధ్య కార్పొరేట్‌ మీడియా చర్చ చేస్తున్నది. లేబర్‌ బ్యూరో చేసిన త్రైమాసిక సర్వేలో ఉద్యోగాల పెరుగుదల ఎక్కువగా ఉండే ఎనిమిది రంగాలైన బట్టల పరిశ్రమ, చేనేత వస్త్రాలు, బంగారు నగలు, నూలు ఉత్పత్తి, ఐటి రంగం, తోలు ఉత్పత్తులు, లోహాలు, ఆటోమొబైల్స్‌లలో 2014లో 4,90,000 మందికి, 2009లో 12,50,000 మందికి ఉద్యోగాలుకల్పించగా 2015లో 1,50,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నట్లుగా వెల్లడి కావటం ఈ చర్చకు తక్షణ కారణం కావచ్చు. గ్రామీణ ఉద్యోగితకు సంబంధించి పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతున్నది. గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, యువతకు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలలో...

దోషులను బోనులో నిలబెట్టాలి

అగస్టా కుంభకోణం, కాగ్‌ తవ్వితీసిన గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జిఎస్‌పిసి) అవినీతి భాగోతంపై పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభాకార్యక్ర మాలను స్తంభింపజేశాయి. ఈ రెండు కుంభకోణాల్లోను ఆవిరైన ప్రజాధనాన్ని మెక్కిన వారిచే కక్కించేందుకు దీనిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిగితే ఉపయోగకరంగా వుండేది. కానీ, పసలేని వాదనలతో సభను అడ్డుకోవడం ఈ కుంభకోణాల్లో దోషులను కాపాడడానికే పనికొస్తుంది. రూ.36 వేల కోట్ల విలువైన పన్నెండు వివిఐపి హెలికాప్టర్ల అమ్మకంలో రూ.360 కోట్ల మేర ముడుపుల చెల్లింపునకు సంబంధించిన అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణం గురించి లేవనెత్తి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని బిజెపి యత్నించగానే, కాంగ్రెస్‌...

'భారత మాత'కు ఇచ్చే గౌరవం ఇదేనా?

భారత్‌ మాతాకీ జై... అనక పోతే దేశద్రోహమే అని సంఫ్‌ు పరివార్‌ అనుయా యులు ఈ మధ్య పదే పదే అంటున్నారు. దేశాన్ని తల్లిగా చూడాలా, తండ్రిగా చూడా లా? లేక తల్లితండ్రిగా చూడ కుండా వేరే పద్ధతిలో దేశ భక్తిని ప్రదర్శించే మార్గమే లేదా? అన్న చర్చ కూడా ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్నది. ప్రస్తు తం ఈ చర్చల జోలికి పోవడం నా ఉద్ధేశ్యం కాదు. దేశంలోని మాతలకు (స్త్రీలను) సమానత్వం ఇవ్వకుండా, వారికి తగిన గౌరవం ఇవ్వకుండా భారత్‌ మాతాకీ జై అంటే దేశభక్తులై పోయి నట్లేనా? అన్నది నేను లేవనెత్త దలుచు కున్న చర్చ. 
సమానత్వం కోసం మహిళలు ఆందోళనలు చేస్తున్న కొన్ని ఘటనలను ఈ మధ్య వార్తల్లోకెక్కాయి. దేశంలో స్త్రీలను ఇప్పటికీ ఎంత అవమానకరంగా, ఎంత ఆక్షేపనీయంగా చూస్తున్నారో ఈ...

ఆర్థిక నేరగాళ్లపై ఆంక్షలుండవా..?

దేశంలో గతంలో ఎన్న డూ కనీవినీ ఎరుగని రీతిలో బ్యాంకులు కొంత ఆర్థిక ఒడిదు డుకులకు గురవుతు న్నాయా..? అంటే అవుననే అనిపిస్తుంది. బ్యాంకుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసిందెవరు...? దేశంలో పేదలు నమ్మకంతో తమ కష్టార్జితాన్ని దాచుకునే బ్యాంకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితేంటి...? అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. పెట్టు బడిదారులు తమ అవసరాలకు బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని తీరా వారు చేపట్టిన సంస్థలు అప్పుల పాలయ్యాయని ఎగవేత దారులుగా మారుతున్నారు. 'భారతదేశంలో పరిశ్రమలు పెట్టండి, అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తాం. భూమి, విద్యుత్‌, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మాదే' అంటూ ఊదర గొడుతూ దేశదేశాలు పట్టుకు తిరుగుతున్న మన పాలకులు ఇక్కడి...

మార్క్సి‌స్టు‌ దృక్కోణం - కులం

దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థలపై హిందూత్వ శక్తుల దాడుల నేపథ్యంలో కులం గురించి వామపక్ష మేధావుల్లో ఒక నూతన చర్చ మొదలైంది. కుల అణచివేత సమస్యను మార్క్సి స్టు దృక్పథంతో అర్థం చేసుకుంటున్న తీరును ఈ చర్చ మరోసారి ముందుకు తెచ్చింది. నేడు జరిగే పోరాటాలపై ఈ చర్చ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చు. అయితే ఇది సైద్ధాతిక ఎజెం డాలో భాగమైన విషయాన్ని కాదనలేము.
మార్క్సిజం 'కులం' కంటే 'వర్గం'కు ప్రాధాన్యతనిస్తుందని, కుల విభజన కంటే వర్గ విభజన ఆధారంగానే మార్క్సిజం సమాజాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకుంటుం దని, తద్వారా కుల సమస్యకు తగిన ప్రాధాన్యతను ఇవ్వటం లేదని చాలామంది ముఖ్యంగా దళిత మేధావులు ఆరోపి స్తున్నారు. మూడు మేధో వైఖరులను ఈ చర్చలో మనం గమనించవచ్చు....

2030 నాటికి పేదరికం కనబడదా?

అవునంటున్నారు పెట్టుబడిదారీ దేశాధి నేతలు. నిజానికి ఆయా దేశాల్లో ప్రభుత్వాధినేతలు రోజూ చెప్పేది అదే. అధికా రంలోకి వచ్చిన వాళ్లు పదవీ కాలంలో తిమ్మిని బమ్మిని చేస్తామని చెబుతుంటారు. అధికారం కోల్పోయిన వాళ్లు తమ కాలంలో దాదాపు పేదరికాన్నే నిర్మూలించినట్లు, తమ అనంతరం అంతా నాశనం అయిపోతున్నట్లు గగ్గోలు పెడు తుంటారు. ఏదిఏమైనా పేదరికం గురించి, పేదరిక నిర్మూలన గురించి జరిగేంత చర్చలో ఒక్క వంతు కూడా పేదరికానికి కారణాల గురించి మాత్రం జరగకుండా పాలక వర్గాలు, పలు పార్టీలు, వారి ఉప్పు తినే మేధావులు జాగ్రత్త పడుతుంటారు.
ఎండిజిల స్థానంలో ఎస్‌డిజిలు
ఎండిజిలు అంటే మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు) 2000...

Pages