ఆర్టికల్స్
మోడీ శుష్క ప్రసంగం
Wed, 2020-04-15 15:26
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నాల్గవసారి దేశ ప్రజల నుద్దేశించి చేసిన ప్రసంగంలో వాగాడంబరం తప్ప ఛిద్రమవుతున్న ప్రజల జీవితాల మెరుగుదలకు సంబంధించిన ఊసే లేదు. మూడు వారాల లాక్‌డౌన్ గడువు ముగియడంతో, దానిని మరో పందొమ్మిది రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సరే. మరి ఈ లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది దినసరి వేతన కార్మికులు, వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనివారల మాటేమిటి? మోడీ ప్రసంగంలో వీరికి సంబంధించిన కనీస ప్రస్తావన లేదు. వీరిని ఆదుకునేందుకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదు. ఇంతకుముందు ప్రకటించిన 1.7 లక్షల...
అంబేద్కర్ స్ఫూర్తితో....
Tue, 2020-04-14 18:51
నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ప్రతి ప్రజాస్వామ్యవాదీ, ప్రతి బడుగు జీవీ, ప్రతి దళితుడూ తమ కోసం జీవిత కాలమంతా పోరాడి, మరణానంతరం కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ మహామనీషిని స్మరిస్తారు. భక్తితో తలచుకుంటారు. ఆయన ఆశయాలకు పునరంకితమౌతారు.
భారత దేశంలో అంబేద్కర్ వేసిన ముద్ర ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తోందంటే పాలక వర్గాలు, ఆధిపత్య వర్గాలు సైతం ఈ రోజు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తాయి. అయితే ఇదంతా మాటలకే పరిమితం అయ్యే నాటకం అని వేరే చెప్పనక్కర్లేదు. నిజంగానే ఈ పాలక వర్గాలకి అంబేద్కర్ మీద గౌరవం ఉంటే మన దేశంలో ఎప్పుడో కుల వివక్ష, కుల పీడన, దాడులు, అత్యాచారాలు నిలిచిపోయి ఉండాలి.
కనీసం ఇప్పుడు ప్రపంచమంతటా కరోనా వైరస్ సృష్టించిన...
మహమ్మారి పీడిత ప్రజలు - ద్రవ్య పెట్టుబడి
Tue, 2020-04-14 18:49
ప్రస్తుత కాలపు ప్రపంచీకరణ లోని ప్రధాన వైరుధ్యాన్ని కోవిడ్-19 మహమ్మారి మన కళ్లకు కట్టినట్లు స్పష్టంగా చూపిస్తోంది. ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలకూ, సాధారణ ప్రజల ప్రయోజనాలకూ మధ్య ఉండే మౌలిక వైరుధ్యమే ఇప్పుడు ప్రధానంగా ముందుకొచ్చింది. ప్రపంచీకరణ శకం అంతటికీ ఈ వైరుధ్యమే మౌలికమైనది. ఇప్పుడది స్పష్టంగా ముందుకొచ్చింది.
వరుసగా ఒక్కొక్క దేశం లోనూ ఇది బైటపడుతోంది. మన దేశాన్నే తీసుకోండి. ఒక్కసారిగా పదుల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. లక్షలాది వలస కార్మికులు తమ స్వంత గ్రామాలకు దూరంగా ఇన్నాళ్లూ పనులు చేస్తున్న వాళ్లు కాస్తా ఆ పనులు పోవడంతో కాలి నడకన వెనక్కి బయలుదేరారు. చాలా మంది క్వారంటైన్‌లో ఉండిపోయారు. వాళ్ల జేబుల్లో చిల్లి గవ్వ లేదు....
వ్యవస్థలపై దాడి
Tue, 2020-04-14 18:45
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) నియామక నిబంధనలను పూర్తిగా మార్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అత్యయిక ఆదేశం (ఆర్డినెన్స్) నిరంకుశ ఏకపక్ష చర్య. కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, సమయం, సందర్భం లేని దుస్సాహసం. ఎస్‌ఇసి పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఎ.పి పంచాయతీరాజ్ చట్టం (1994) లోని సెక్షన్ 200ను సవరిస్తూ శుక్రవారం ఆగమేఘాల మీద ప్రభుత్వం ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్‌కు పంపగా, వెనువెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఆ రాత్రే ఆర్డినెన్స్ గెజిట్ నోటిఫికేషన్ జీవో, మూడేళ్ల కాలపరిమితి ముగిసిందంటూ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ మరో జీవో జారీ అయ్యాయి. తెల్లవారి శనివారం పొద్దున పొద్దున్నే కొత్త ఎస్‌ఇసిగా మద్రాస్...
పేకమేడలా కూలుతున్న ప్రపంచీకరణ
Sun, 2020-04-12 17:56
కరోనా వైరస్ మృతుల సంఖ్య లక్ష దాటిపోరుంది. ఇందులో డెబ్భై అయిదు వేల మంది అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా వంటి సంపన్న దేశాలలోనే మరణించడం దిగ్భ్రాంతి కలిగించే వాస్తవం. ఆయా దేశాల అనుభవాలలో పరిపరివిధాలుగా వుండొచ్చు గాని ఒక విషయంలో మాత్రం తేడా లేదు. ఇది ప్రపంచీకరణ వైఫల్యం. నయా ఉదారవాద విధాన సంక్షోభం. అందుకు అతి తీవ్రంగా గురైన వైద్య వ్యవస్థల వైఫల్యం. ప్రపంచ ప్రజల ఆరోగ్య, ఆర్థిక, ఆహార భద్రతలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిన విషాదం. అద్దాల మేడలా మెరిసిన అంతర్జాతీయ వ్యవస్థ భూత్ బంగళాగా మారిపోయింది. ఏ యుద్ధం లేకుండానే శత్రువు దాడి లేకుండానే శవాల గుట్టలు పడుతున్నాయి. కరోనా అదృశ్య శత్రువు అంటున్నారు గాని నిజానికి అగోచర శత్రువు. మనం...
కరోనా వైరాగ్యం..
Sun, 2020-04-12 17:51
సమాజం ఎప్పుడూ మారుతూ వుంటుంది. ప్రపంచంలో ఏ మార్పు అయినా ఆకాశం నుండి ఊడిపడదు. సమాజంలోనే అందుకు సంబంధించిన చోదకశక్తులు వుంటాయి. బుద్ధిజీవులు వాటిని అర్థం చేసుకొని మార్పును అంగీకరిస్తారు. మరికొందరు వాటికి మానవాతీత శక్తుల్ని అంటగట్టి ఆవేదన చెందుతారు. అనేక భయాందోళనల మధ్య, సవాలక్ష అనుమానాల మధ్య, అనేక అపనమ్మకాల మధ్య, అనంత వేదనలు, ఆవేదనల మధ్య వున్నాం మనం. లాక్‌డౌన్‌లో చాలారోజులు ఉండిపోతే వైరాగ్యం రావడం కద్దు. చాలా రకాల వైరాగ్యాలున్నాయి. ఎవరి చావుకైనా వెళ్లొచ్చినప్పుడు...ఈ పాడు జీవితం బుద్బుదప్రాయం. ఎప్పుడైనా వెళ్లిపోవాల్సిందే కదా.. చెయ్యకూడని పనులన్నీ చేశాం, ఏం కట్టుకుపోతాం...వంటి భావనలతో సతమతం కావడమే స్మశాన వైరాగ్యం. కడుపులో ఆకలి కేక పెట్టగానే ఈ...
కరోనాపై పోరు-రెండు వ్యవస్థల తీరు
Sat, 2020-04-11 10:11
అతి చిన్నదే, అయినా కరోనా వైరస్ ప్రాణాంతకమైనది. ఈ 21వ శతాబ్దంలో రెండు సామాజిక వ్యవస్థలైన పెట్టుబడిదారీ విధానం, సోషలిజం మధ్య గల తేడాను ప్రస్ఫుటంగా మరోసారి కనపరిచింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ను కొన్ని దేశాలు ఎదుర్కొన్న తీరు ఈ తేడాను ప్రముఖంగా చూపిస్తోంది. ఒకవైపు-ప్రపంచం లోనే అతి శక్తివంతమైన సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశమైన అమెరికా వుంది. ప్రైవేటీకరించిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వుంది. కార్పొరేట్ సంస్థలు నిర్వహించే ఆరోగ్య రంగం లాభాల దిశగా పయనిస్తోంది. కానీ, కరోనా వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో ఈ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. పైగా ఆస్పత్రుల్లో పడకలు, ఐసియు లు, వెంటిలేటర్లు,...
వేగుచుక్క వుహాన్
Sat, 2020-04-11 10:02
అత్యంత సూక్ష్మ రూపంలో ఉండే కరోనా వైరస్ నేడు విశ్వ మానవాళికి పెను సవాలు విసురుతూ అతి పెద్ద శత్రువుగా పరిణమించింది. అణ్వాయుధ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అణగారిన దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపిస్తూ హడలెత్తిస్తున్న ఈ మహమ్మారిపై చైనాలోని వుహాన్ నగరం విజయం సాధించింది. ఇది ఈ వైరస్‌పై మానవాళి సాగిస్తున్న పోరాటంలో దక్కిన తొలి విజయం. ప్రజలు, ప్రజా సంక్షేమం కోరే పాలకులు ఉమ్మడిగా పట్టుబడితే ఎంతటి భయంకరమైన శత్రువైనా పాదాక్రాంతం కాకతప్పదనేందుకు వుహాన్ తార్కాణంగా నిలుస్తోంది. కరోనా మొట్టమొదట వెలుగుచూసిన హ్యుబెయి ప్రావిన్స్ లోని వుహాన్‌లో 76 రోజుల లాక్‌డౌన్‌కు బుధవారం తెర దించడం అక్కడి ప్రజలకే గాక విశ్వజనులందరికీ అమితానాందం...
కేంద్రం సాయం చేయదు...అప్పు తీసుకోనివ్వదు...
Fri, 2020-04-10 14:59
లాక్‌డౌన్ కారణంగా కేరళ రాష్ట్రానికి ఏమేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని మీ అంచనా!
మాకు సాధారణ పరిస్థితులలో ఉండే ఆదాయాలలో కన్నా 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నాం. లాక్‌డౌన్ కారణంగా జిఎస్‌టి వలన వచ్చే ఆదాయం సహజం గానే రాదు. మేం లాటరీలు నిలిపివేశాం. కేరళలో మందు దుకాణాలు మూసివేశాం. మోటార్ వాహనాల అమ్మకాలు లేవు. భూ లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినా రాబోయే మూడు నెలలలో ఇదివరకటి ఆదాయంలో సగానికి సగం తగ్గుదల ఉంటుంది. మొదటిగా లాక్‌డౌన్ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెండు, లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే యథాస్థితి రాదు. మూసివేసిన చిన్న పరిశ్రమల పరిస్థితి ఏమవుతుందో చెప్పలేను. పర్యాటకం లాంటివి...
కరోనాపై పోరు - నేర్పుతున్న పాఠాలు
Fri, 2020-04-10 14:53
కరోనా వైరస్ మహమ్మారి మన సామూహిక జీవనంలోని అత్యంత తీవ్రమైన సమస్యలనూ, దాని ప్రధాన వైరుధ్యాలనూ బట్టబయలు చేసింది.ఎంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినా కొనలేని ఎన్నో వస్తువులు ప్రపంచంలో ఉన్నాయనీ, ''మార్కెట్ అదృశ్య హస్తం'' మీద ఆధారపడి పరిష్కరించలేని అత్యంత కష్టతరమైన సమస్యలెన్నో ఉన్నాయనీ, జనానికి 'హఠాత్తుగా' తెలిసివస్తున్నది. అంతే కాదు, ఆ సమస్యలను మనం ఒంటరిగా పరిష్కరించలేమని కూడా తెలిసివస్తున్నది. మన ప్రపంచమంతా ఒకటేననీ, దాన్ని రక్షించడానికి అందరమూ కలిసి పని చేయవలసిందేననీ తెలిసి వస్తున్నది. క్వారంటైన్ లూ, కలవకుండా ఉండడాలూ ఎంత ముఖ్యమైనప్పటికీ, ఈ మహా విపత్తును ఓడించాలంటే మనందరమూ కలిసి, ప్రపంచమంతా ఒకటిగా, ఉమ్మడిగా పని చేయవలసిందేననీ తెలిసివస్తున్నది....
మరిన్ని చర్యలు కావాలి..
Fri, 2020-04-10 14:49
కరోనా వైరస్ నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రాష్ట్రంలో బుధవారం నుండి అందుబాటు లోకి రావడం స్వాగతించదగింది. అవి కూడా విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో తయారుకావడం ముదావహం. రక్త నమూనాకు కరోనా వైరస్ ఫలితం రావడానికి ప్రస్తుతం దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఈ కిట్ల ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే తెలియనుండడం గమనార్హం. అక్కడే వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. వ్యక్తిగత భద్రత పరికరాలు (పిపిఇలు) కూడా రాష్ట్రం లోనే తయారవుతున్నాయి. కరోనా నివారణా చర్యల్లో స్వయంపోషక దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభ పరిణామం. ప్రైవేటు రంగంలో పని చేస్తున్న అనేక మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల సేవలను వినియోగిస్తున్న ప్రభుత్వం 58 ప్రైవేటు ఆసుపత్రులలో...
లాక్‌డౌన్ - అనుభవాలు
Thu, 2020-04-09 13:01
దేశంలో ఈ లాక్‌డౌన్ కాలంలో మనం కొన్ని అంశాలను గమనించవచ్చు. మొదటిది, భారతదేశ ప్రజలంతా ప్రభుత్వ సూచనలను అనుసరించడం ద్వారా తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రజలంతా ఐక్యంగా తమ పాత్రను పోషిస్తున్నారు.దేశ వ్యాప్తంగా సాధ్యాసాధ్యాల మేరకు భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యకర్తలు, పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు...నిరాశలో, అవసరాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం మనకు ప్రోత్సాహకరమైన మరొక అనుభవం. ఎర్రజెండా ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే చిహ్నంగానే ఉంటుంది.ఈ కాలంలో ప్రతికూలమైన విషయం ఏమంటే... దేశ ప్రజల మాదిరిగా, మన కేంద్ర...