ఆర్టికల్స్
వారికి అంబేద్కర్ అవసరం ఎందుకొచ్చింది?
Sat, 2016-03-26 14:43
అంబేద్కర్ గురించి అంద రూ మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అని, దళిత వర్గా ల పెన్నిధి అని కీర్తిస్తు న్నారు. రిజ ర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల హక్కు అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాజాగా ప్రస్తుతించారు. అంబే ద్కర్‌ను ఇప్పుడు జాతీయ పార్టీలు అన్నీ సొంతం చేసుకునే దిశలో పోటీపడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి ఈ విషయంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అంబేద్కర్ పేరు చెప్పి ఓట్లు పొందే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందుకే సమయం వచ్చినప్పుడే కాకుండా అంబేద్కర్ పేరు చెప్పడానికి సమయం కొనితెచ్చుకుంటున్నారు. జాతీయ పార్టీల కు వేగుచుక్కగా ఇప్పుడు అంబేద్కర్ కన్పిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా చెలరేగుతున్న ప్రజా ఉద్యమాల...
విషం చిమ్ముతున్న దివిస్
Wed, 2016-03-23 18:37
పరిశ్రమలొస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్న మాటలు భ్రమలు కల్పించేవి తప్ప భరోసా ఇచ్చేవి కావని అర్థమవుతోంది. నమ్మించి పారిశ్రామికవేత్తల అవసరాలు తీర్చడం కోసం ప్రజలతో ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలని అనుభవాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలోని సెజ్, ఫార్మా, హెటిరోడ్రగ్స్, బ్రాండిక్స్, డెక్కన్ కెమికల్స్, దివిస్ ఇలా ఏ కంపెనీని స్పృశించినా, దాని చరిత్ర చూసినా, నడత చూసినా అర్హతవున్న స్థానికులకు ఉద్యోగాలివ్వకపోవడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, కాలుష్య నియంత్రణ చర్యలు అమలుచేయకపోవడం, ఆర్జించిన వార్షిక లాభాల్లో రెండు శాతం సిఎస్‌ఆర్ నిధులను ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేటాయించకపోవడం వంటి...
కుహనా దేశభక్తుల ఆట కట్టించాలి..
Wed, 2016-03-23 13:08
కుహనా దేశభక్తి పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి కూటమి సాగిస్తున్న ఏడుపులను, గగ్గోలును సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఇంత హంగామా చేస్తున్న ఈ హిందూత్వ ప్రచారకులకు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రికార్డు లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ పేర్కొన్నారు. పైగా దీనికి విరుద్ధంగా తనను వదిలిపెడితే బ్రిటీష్ పాలకులకు అవసరమైన సాయాన్ని అందిస్తానంటూ హిందూత్వ సిద్ధాంత వ్యవస్థాపకుల్లో ఒకరైన వీర్ సావర్కార్ ముందుకొచ్చారని విమర్శించారు. సామ్రాజ్యవాదాన్ని బుజ్జగించే విధానాన్ని అనుసరించే శక్తులు నిజమైన జాతీయవాదులు కాదని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు గానూ ఈ బూటకపు జాతీయవాదాన్ని ఓడించేందుకు చివరి వరకు తమ పోరాటాన్ని సాగించేవారే...
నీరుగారుతున్న గృహ నిర్మాణం..
Sat, 2016-03-19 17:43
గుడిసెలులేని ఆంధ్రప్రదేశ్, పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళు, 2022 నాటికి అందరికీ ఇళ్ళు అంటూ పాలకులు ఊదరగొడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి. గృహనిర్మాణ పథకాల పేర్లు మారాయి. ఇందిరమ్మ, రాజీవ్ పథకాల స్థానంలో ఎన్‌టిఆర్ పథకాలొచ్చాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. 22 నెలలు గడచినా తెలుగుదేశం, బిజెపి పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు, మధ్యతరగతివారికి ప్రత్యేక గృహ పథకం పేరుతో వాగ్దానాల వర్షం కురిపించింది. ఈ కాలంలో ''గాలిమేడలే'' తప్ప ఇళ్ళ నిర్మాణం సాగలేదు. పెరిగిన ఇళ్ళ అద్దెలతో పేదలేకాదు మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తుతు న్నాయి. సొంత ఇల్లు కలగానే...
విస్తృత చర్చ అవసరం..
Wed, 2016-03-16 17:04
దేశ న్యాయవ్యవస్థ విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోం దంటూ సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరోమారు న్యాయవ్యవస్థ పనితీరును చర్చనీయాం శం చేశాయి. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిజానికి ఈ తరహా చర్చ ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్నోసార్లు ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇలా చర్చ జరిగిన ప్రతిసారీ కాయకల్ప చికిత్సతో సరిపుచ్చడం అలవాటుగా మారింది. అయితే, గతానికి ఇప్పటికీ పెద్ద తేడానే ఉంది. అన్ని రంగాల్లోనూ అవినీతిని వ్యవస్థాగతం చేసిన ఆర్థిక సంస్కరణలు న్యాయవ్యవస్థనూ వదలలేదన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టంగా...
పీర్‌లెస్ రక్షణ ప్రభుత్వ బాధ్యత..
Mon, 2016-03-14 17:34
దేశంలోని చిన్న మొత్తాల పొదుపు సంస్థలలో ప్రముఖ స్థానంలో ఉండి ఆర్‌బిఐ నిబంధనలకనుగుణంగా నడుస్తూ ప్రజాభిమా నాన్ని చూరగొన్న సంస్థ పీర్‌లెస్ జనరల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లిమి టెడ్. నిజాయితీగా తన ఖాతాదారులకు మెచ్యూరిటీ సొమ్మును అందిస్తున్న ఈ సంస్థ ఆర్‌బిఐ విధించిన ఆంక్షల ఫలితంగా తన వ్యాపారాన్ని 2011 ఏప్రిల్ 1 నుంచి ఆపేయాల్సి వచ్చింది. దీనితో పీర్‌లెస్ సంస్థ ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ఖాతాదారులు తిరిగి తమ డబ్బును పీర్‌లెస్ సంస్థలో పొదుపు చేసుకొనే అవకాశం కోల్పో యారు. అంతేకాక ఖాతాదారులు తాము కష్టపడి సంపాదించు కున్న మొత్తాలను దేశంలోని శారదా చిట్‌ఫండ్ లాంటి అనేక బోగస్ సంస్థలలో పెట్టుబడులు పెట్టి పలు మోసాలకు గుర య్యారు....
ఇదేనా జవాబుదారీతనం?
Sat, 2016-03-05 12:26
ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ చర్యలపై కాంగ్రెస్, వామపక్షాలు సంధించిన విమర్శనాస్త్రాలతో పూర్తిగా ఆత్మరక్షణలో పడిన ప్రధాని నరేంద్ర మోడీ ఎదురు దాడికి దిగడం దారుణం. పార్లమెంటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని గురువారం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రతిపక్షాలను కవ్వించే రీతిలో సాగింది. సాధారణంగా ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేదిగా ప్రధాని సమాధానం వుంటుంది. కానీ, గురువారం నాటి మోడీ సమాధానం దీనికి పూర్తి భిన్నంగా వుంది. విమర్శకు ప్రతి విమర్శ ఎప్పుడూ సమాధానం కాదు. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన వాటిలో అసంబద్ధమైనవి, నిర్హేతుకమై నవి ఏమైనా వుంటే అది వేరు. వాళ్లు...
రాష్ట్రం పట్ల ఎందుకీ వివక్ష?
Wed, 2016-03-02 12:08
మొన్నటికి మొన్న రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం, నిన్న జనరల్ బడ్జెట్‌లోనూ అదే తీరున వ్యవహరించింది. రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎందుకింత వివక్ష? రాష్ట్రంలో వున్నది తన మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమానా? లేక ఆంధ్రప్రదేశ్ అంటే ఖాతరులేనితనమా? కేంద్రం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఒక ఎత్తు అయితే, ఇది అన్యాయమని తెలిసినా నోరు మెదపకుండా మిన్నకుండిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత మరో ఎత్తు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి తరువాత మాట్లాడతానని చెప్పడం శోచనీయం. ఇప్పుడు ప్రశ్నించకుండా తరువాత ఎప్పుడో మాట్లాడి ఉపయోగమేమిటి? దేశంలోకెల్లా అత్యంత సమర్థతకలిగిన ముఖ్యమంత్రినని...
జాతి వ్యతిరేకులెవరు?
Fri, 2016-02-19 10:46
ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యా లయంలో వారం రోజుల క్రితం జరిగిన కొన్ని ఘటనలను ఆధారం చేసుకొని విద్యార్థి ఉద్యమాలపైనా, వామపక్షాలపైనా ఆర్‌యస్ యస్ నాయకత్వంలోని సంఘపరివారం భౌతికంగా, భావజాలపరంగా దాడులు చేస్తోంది. మరో నాలుగురోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ మరణంతో ఉత్పన్నమైన సమస్యల నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక రాజకీయ ఎత్తుగడగా జెఎన్‌యు ఘటనలకు మసిపూసి మారేడుకాయ చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోం ది. తనను కాదన్న ప్రతి ఒక్కరినీ దేశద్రోహులుగా ముద్రవేసి, తమకు తాము దేశభక్తులుగా ముద్రవేసుకొంటోంది. వారిచ్చే సర్టిఫికెట్‌తోనే ఈ దేశంలో ఎవరైనా దేశభక్తులుగా చెలామణి కావాలని...
దళితులకు అందని రాజ్యాంగ ఫలాలు..
Wed, 2016-02-10 11:42
ప్రతి భారతీయుడి కంట తడిని తుడిచివేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను నెరవే ర్చేందుకు ప్రతి పౌరునికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పిం చాలనే లక్ష్యంతో మన రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దళితులకు అందాయా అని ప్రశ్నించుకుంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. రాజ్యాంగ ఫలాలు అందక పోగా మిగతా హక్కులను కూడా గుంజుకుం టున్నారని స్పష్టమౌతోంది. దళితులు నేటికీ అమానుషమైన కులవివక్ష, అంటరానితనం, దాడులు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారు. అగ్రకుల అహంకారానికి బలౌతున్నారు. ఇష్టపడి ఆహారం తినడానికిలేదు. తన భావాలను చెప్పుకునే స్వేచ్ఛలేదు. బయటకు వస్తే దాడులు, అవమానాలు. వీటికి...
చంద్రబాబుకు 'తుని' ఒక హెచ్చరిక
Tue, 2016-02-09 15:41
సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎదురు దాడికి మించిన ఆత్మరక్షణ లేదన్న సూత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో బాగా ఉపయోగిం చుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఏ సమస్యనైనా తీసుకోండి, అది రాజధాని సమస్యా, పోలవరం సమస్యా లేక రాయలసీమ అభివృద్ధి సమస్యా... ఏదైనా మంచి అంతా తన ఖాతాలో వేసుకోవడం చెడు జరిగితే అధికారుల మీద తోసేయడం, విమర్శలొస్తే ఎదురుదాడికి దిగడం ముఖ్యమంత్రి అనుసరి స్తున్న వ్యూహం. తాజాగా కాపుసామాజిక వర్గం ఆందోళన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే వ్యూహం అనుసరిస్తున్నారు.
రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలోని కాపులను కూడ దీయడానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన రాజకీయ పండితులను కూడా ఆశ్చర్యపరిచిందని...
రాజధాని యువత - భరోసా లేని భవిత
Tue, 2016-02-09 15:36
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శంకుస్థాపన సభలో ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అని ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా కూడా భూమినే నమ్ముకున్న 29 గ్రామాల రైతులు, ఆ భూములపై ఆధారపడ్డ కూలీలు, సంబంధిత ఉత్పత్తితో ముడిబడ్డ చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు మొత్తం ప్రజానీకం తమ భూములను, ఉపాధిని, జీవనాన్ని రాజధాని నిర్మాణం కోసం వదులుకొని (బలవంతంగా అయినా) త్యాగం చేశారు. కానీ నేడు అదే ముఖ్యమంత్రి త్యాగాలకు ప్రతిఫలంగా ఇస్తామన్న హామీలు నెరవేర్చమని ఆందోళన చేస్తున్న వారి పట్ల, మా రాజధానిలో మాకు చోటివ్వండని, మా ఇళ్ళను తొలగించొద్దని కోరుతున్న ప్రజల పట్ల అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రజలనే పనికిమాలిన వాళ్లుగా, అభివృద్ధి...