ఆర్టికల్స్

కరోనా మ‌హ‌మ్మారి... చైనా చికిత్సా విధానం...

కరోనా సోకిన రోగి డాక్టర్‌ మీద వాంతి చేసుకుంటే ఏం చెయ్యాలి? క్వారంటైన్‌ లో వాంతి చేసుకుంటే ఏం చేయాలి? ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో వైరస్‌ నిండిన రక్తం చిందితే ఏం చేయాలి? ఆస్పత్రిలో వైరస్‌ సోకిన ప్రాంతానికి, సురక్షిత ప్రాంతానికి మధ్య తేడాను ఎలా పాటించాలి? ఎటువంటి అనుమానితులను వైద్య పరీక్షలకు ఎంపిక చేసుకోవాలి? కరోనా వైరస్‌ బారినపడి చనిపోయిన వారిని ఎలా అప్పగించాలి?గత మూడు నెలలుగా ముందు వరుసలో నిలబడి పని చేసిన డాక్టర్లు, నర్సుల అనుభవాలను క్రోడీకరించి...ప్రపంచ దేశాలకు ఉపయోపడే విధంగా చైనా ఒక నివేదిక విడుదల చేసింది. పై ప్రశ్నలకు సమాధానం అందులో లభిస్తుంది. నివేదిక లోని పలు అంశాలను 'బిజినెస్‌ స్టాండర్డ్‌' దినపత్రిక ధారావాహికగా ప్రచురించే ప్రయత్నంలో...

అంతా వ్యాపారమేనా..?

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్‌ మ్యాచ్‌లను ఎలాగైనా నిర్వహించేందుకు బిసిసిఐ (బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) సన్నాహాలు చేస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఐపిఎల్‌ 2020 మ్యాచ్‌లు దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్‌ 14 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? సడలించాలా? కొనసాగించాలా? అన్న విషయమై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అనేక రాష్ట్రాలు మరికొద్ది రోజులు కొనసాగించాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయంలో స్పష్టత లేదు. ఈ చర్చ సాగుతుండగానే 'ఆలూ...

హై హై నాయకా!

మనం ఒక యుద్ధంలో ఉన్నాం. అందరమూ సైనికులమే. మన అందరి శక్తి సామర్థ్యాలనీ కలబోసి యుద్ధంలో శత్రువు మీద విజయం సాధించేలా సైన్యాన్ని నడపవలసిన బాధ్యత సేనా నాయకుడిదే. అతగాడేం ఆదేశించినా మనం పాటిస్తాం. ఇందులో సందేహం లేదు. మార్చి 22న నాయకుడు జనతా కర్ఫ్యూ పాటించాలన్నాడు. పాటించాం. చప్పట్లు కొట్టమన్నాడు. చప్పట్లే కాదు, శంఖాలూ మోగించాం. తాళాలు, బాజాలు వాయించాం. మోత మోగించాం. నాలుగ్గంటలన్నా వ్యవధి ఇవ్వకుండానే లాక్‌డౌన్‌ పాటించమన్నాడు. పాటిస్తున్నాం. ఎన్ని లక్షల మంది కాలినడకన లాంగ్‌మార్చ్‌లు చేయాల్సి వచ్చిందో లెక్క లేదు. అయినా నడిచారు. బహుశా ఇంకా కొందరు నడుస్తూనే ఉన్నారు కూడా. రాష్ట్రాల సరిహద్దుల దగ్గర వాళ్లని నానా యాతనలు పెట్టారు. బందెల దొడ్లో పశువుల్ని...

విషాదంలో వలస కార్మికులు

కోవిడ్‌-19 మరణాల కంటే స్వగ్రామాలకు బయలుదేరి మార్గమధ్యంలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. స్వగ్రామాలకు వస్తుండగా 40 మంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మాసాల గర్భణితో సహా సహరాన్‌ పూర్‌ నుంచి వంద కిలోమీటర్ల కాలినడకన బయలుదేరిన వలస కార్మిక కుటుంబాన్ని 50 కిలోమీటర్లు తర్వాత ప్రజలు ఆదుకొని అంబులెన్స్‌లో సొంతూరుకు పంపారు. నాగపూర్‌ నుంచి కాలినడకన చెన్నై బయలుదేరిన వలస కార్మికుడు హైదరాబాద్‌ శివారులో గుండెపోటుతో మరణించాడు. తొమ్మిది నెలల నిండు గర్భిణీ కాళీబారు దీ అలాంటి గాధే. ఉత్తరప్రదేశ్‌ లోని మధుర నుంచి కాలినడకన బయలుదేరి మధ్యప్రదేశ్‌ లోని స్వగ్రామానికి...అనేక అవస్థలు పడుతూ ఐదు ట్రక్కులు మారి...ఏప్రిల్‌ 1న ఇంటికి చేరింది. ఇలాంటి వలస...

వాస్తవాలను దాచిపెడితే విశ్వసనీయత ఏముంది?

ప్రపంచ వ్యాపితంగా ప్రభావం చూపుతున్న ఈ అంటువ్యాధి వల్ల ఆర్థికంగా కలిగే నష్టాల గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ, ప్రజాస్వామిక వాతావరణాన్ని కుదించడం వల్ల జరిగే కీడు గురించి అంతగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. అసోం దగ్గర నుంచి అమెరికా దాకా నిరంకుశ పోకడలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం. కరోనాను సాకుగా చూపి హంగరీ ప్రధాని, పచ్చి మితవాది విక్టర్‌ ఓబ్రాన్‌ తప్పుడు సమాచారం ఇచ్చే వారిని జైలుకు పంపడంతో సహా పలు క్రూరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని పార్లమెంటరీ ఆమోదానికి పెట్టారు. డిక్రీల ద్వారా పాలన సాగించేందుకు ఎమర్జెన్సీని రుద్దారు. ఈ అత్యయిక పరిస్థితికి నిర్దిష్ట గడువు అంటూ ఏమీ లేదు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటెర్టే కరోనా లాక్...

మత విద్వేషాలకు తావివ్వొద్దు

కరోనా మహమ్మారిపై జాతి యావత్తూ ఒక్కటై పోరాడుతున్న వేళ దానిని బలహీనపరిచేలా కొన్ని స్వార్థపర శక్తులు యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శతాబ్దం లోనే అతి భయంకరమైన శత్రువుతో ప్రపంచం పోరాడుతోంది. మన దేశంలో దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మత పరంగా సమాజంలో చీలికలకు ఆస్కారమిచ్చేలా వ్యవహరించడం శోచనీయం. కరోనాకు మతం రంగు పులిమేందుకు సోషల్‌ మీడియా లోను, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా సాగుతున్న గోబెల్స్‌ ప్రచారానికి, అధికారంలో ఉన్న పెద్దలకు సంబంధం లేదని అనుకోలేము. కరోనాపై పోరు ప్రకటించిన సమయంలో ఢిల్లీలో వందలాది మందితో సమావేశం ఏర్పాటు చేయడం 'తబ్లిఘీ జమాత్‌' నిర్వాహకుల బాధ్యతారాహిత్యమే. కరోనా...

రవాణా రంగం కుదేలు

 కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌ ప్రభావం తూర్పు గోదావరి లోని సుమారు 1.50 లక్షల మంది ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులపై తీవ్రంగా పడింది. అత్యవసర సరకుల రవాణా మినహా మిగిలిన సరకుల రవాణా నిల్చిపోవడంతో లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు ఉపాధి కరువైంది. ఆర్థిక సంక్షోభం, ఇటీవల వరకు ఎదుర్కొన్న ఇసుక కొరత వల్ల ఇప్పటికే రవాణా రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంది. దీనికి లాక్‌డౌన్‌ కూడా తోడు కావడంతో ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులు, ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకురావాల్సి వస్తోంది.తూర్పుగోదావరి జిల్లాలో పది టన్నుల కెపాసిటీగల టిప్పర్‌, క్వారీ లారీలు 6,500 వున్నాయి. 20...

ఒక విషాదానికి తెరతీసిన తీరు

దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉంది. కాని వేల సంఖ్యలో వలస కూలీలు ప్రతి పట్టణం లోనూ బస్‌స్టాండ్లలో కిక్కిరిసి పోయారు. లేదా రోడ్ల మీద ఉన్నారు. ఇక లాక్‌డౌన్‌కి అర్థం ఏంటి? ఈ మహమ్మారి వ్యాపించకూడదన్న లక్ష్యంతోనే లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాంతరవాసానికి బయలుదేరి ఇంతవరకూ ఈ మహమ్మారి సోకని పల్లె ప్రాంతాలకు పోతున్నారు. అక్కడేమో ప్రజారోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా మానవ జీవితాలు విషాదం కాకూడదని లాక్‌డౌన్‌ విధిస్తే...అంతకన్న తీవ్రమైన మానవ విషాదం ఇప్పుడు కళ్లెదుట కనపడుతోంది!కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించారు. సరైన ప్రణాళిక లేకుండా, ముందస్తుగా తగిన సన్నాహాలు చేయకుండా ఇటువంటి...

విలవిల్లాడుతున్న ఆదివాసీలు

కరోనా వైరస్‌ ప్రమాదం గుర్తించని మోడీ ప్రభుత్వం దేశాన్ని లాక్‌డౌన్‌ చేసింది. ముందస్తు ఏర్పాట్లు లేకుండా అర్థంతరంగా అమలు చేసిన లాక్‌డౌన్‌ వలన పేదలు, రోజు కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రైతులు అందునా ఆదివాసీలు, దళితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.లాక్‌డౌన్‌తో ఆదివాసీల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆదివాసీలు వారపు సంతల్లో ఉత్పత్తులు అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కుంటారు. లాక్‌డౌన్‌ వలన వారపు సంతలు మూసేయాల్సి వచ్చింది. సంతలు లేనందున తమ సరుకును అమ్ముకోలేక పోతున్నారు. నిత్యావసరాలు కొనుక్కోలేకపోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చింతపండు పంట వస్తుంది. అలాగే కొండ చీపుళ్లు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలకు పెద్ద...

వ్యవసాయం లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని పూర్తిగా విస్మరించింది. సర్కారు నిర్లక్ష్య పర్యవసానాలు వ్యవసాయ రంగాన్ని, మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సేద్యం సంక్షోభంలో కూరుకుపోగా కర్షకులు ఆత్మహత్యలబాట పట్టారు. ఆర్థిక మాంద్యం తోడైన ఫలితంగా పరిస్థితి మరింతగా దిగజారింది. సరిగ్గా ఇప్పుడే కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం వెనకాముందు చూడకుండా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌, కునారిల్లుతున్న వ్యవసాయ రంగంపై పిడుగుపాటైంది. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న కేంద్రం, దాని వలన నష్టపోయే కొన్ని వర్గాల...

అలసత్వం, అల్పత్వం, ఆత్మ సంతృప్తి .. అనర్థం

కేవలం పదిహేను రోజుల వ్యవధిలో దేశంలో కరోనా తప్ప మరో మాట వినిపించకుండా పోయిన స్థితి. చూస్తుండగానే దాదాపు రెండు మాసాల కాలం పోగొట్టుకున్నాం. ఇది ఇంకా తీవ్రమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా వంటి దేశమే అతలాకుతలమై పోతున్నది. విస్త్రుతంగా పరీక్షల పని పెట్టుకోకుండా మన పరిస్థితి మెరుగని చెప్పుకున్న దశ మారింది. ఇప్పుడు ఐసిఎంఆర్‌ పరీక్షలు పెంచే దిశలో ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు గాని దానికి అవసరమైన సదుపాయాలు లేవు. కోటి మందికి ఒక్క లాబొరేటరీ వుండగా వాటిలోనూ మూడో వంతు సమర్థతనే వాడుకుంటున్నాము. మాస్కులు, కిట్లు, కవర్‌ ఆల్‌లు, వెంటిలేటర్లు అన్నిటికీ తీవ్రమైన కొరత వెన్నాడుతూనే వుంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రకటనలు వీడియో మీడియా...

కరోనా మహమ్మారి - కఠోర వాస్తవాలు!

 ప్రపంచంలో తలెత్తే ప్రతి మహమ్మారిని కచ్చితంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల్లోంచి పరిశీలించాల్సిందే. ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకమైన మౌలిక సేవలను నయా ఉదారవాద పెట్టుబడిదారీవాదం ధ్వంసం చేస్తున్న సమయంలో కరోనా వైరస్‌ మహమ్మారి ప్రబలింది. అనేక దేశాల్లో ప్రైవేటీకరణ ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ప్రజలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఇల్లు, విద్య, ప్రభుత్వ రవాణా వంటి వాటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు వదిలి పెట్టాయి. సమాజం ఎదుర్కొనే ఏ సంక్షోభమైనా-అది ఆర్థికమైనా లేక సామాజికమైనా-ప్రభుత్వ విధానాల ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఫైనాన్స్‌ పెట్టుబడి- కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకులు, కోటీశ్వరుల-ప్రయోజనాలను పరిరక్షించేదిగానే వుంటుందే తప్ప కార్మికుల...

Pages