భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 31 జూలై, 2024.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి
కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సహాయపడతామని ఒకవైపు చెబుతూనే నిజాయితీగా అటువంటి ప్రయత్నమేమీ చేయకపోవడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.