September

అభివృద్దికి పేదలు అడ్డుకాదు..

అభివృద్ధికి పేదల గుడిసెలు అడ్డంకి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు అన్నారు. భవానీపురం కరకట్ట సౌత్‌ ప్రాంతమైన భవానీఘాట్‌ నుండి పున్నమి హాోటల్‌ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ కరకట్ట వాసులు వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీచేసి జెఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు తరలివెళ్లాలని నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీచేయటం సిగ్గుచేటన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నగరానికి దగ్గరగా వుండి ఏదోఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని ఏక్కడో దూరంగా పడేస్తే వారి జీవన భృతి కష్టతరంగా మారుతుందన్నారు.

144 సెక్షన్‌ ఎత్తేయాలి: పాశం

రాజధానిలో విధించిన 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, వ్యవసాయ కార్మికులు, ఇతర భూమిలేని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ చేపట్టాలని గుంటూరులో మంగళవారం జరిగిన సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 'రాజధాని ప్రాంతంలో నిర్భంధం' అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు ప్రసంగించారు.ప్రభుత్వం రాజధాని ప్రజలకిచ్చిన ఒక్క వాగ్థానం కూడా అమలు చేయకపోగా నిర్భంధాలు ప్రయోగిస్తోంది. ఈ విధానాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఎదుర్కొవాలి.

ల్యాండ్‌ బ్యాంక్‌ వద్దు :మధు

పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా భూసేకరణ చేయడాన్ని ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి  లేఖ రాశారు. సారవంతమైన వ్యవసాయ భూములను బడా కార్పొరేట్‌ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించడం సరికాదని, ఈ విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో అవసరానికి మించి పెద్ద మొత్తంలో రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని విరమించుకోవాలని కోరారు.

జిఒ 329ను రద్దు చేయాలి

శ్రీకాకుళం జిల్లా సోంపేట చిత్తడి నేలల్లో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 329ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. చిత్తడి నేలల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించడం చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చిత్తడి నేలల సంరక్షణ చట్టంలోని 4 (1) (ఱఱ) ప్రకారం బోట్‌ జెట్టీ తప్ప, ఇతర ఏ కట్టడమూ నిర్మించరాదని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, స్థానిక ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు.

విద్యారంగ స్వేచ్ఛకు ప్రమాదం..

 ఈమధ్య పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న విద్యార్థుల పోరాటం గురించి మీడియాలో చూస్తున్నాం. ఆ సంస్థకు అధ్యక్షుడిగా గజేంద్ర చౌహాన్‌ను, ఆయనతోపాటు మరో ముగ్గురిని పాలక మండలి సభ్యులుగా నియమించటాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆ సంస్థతో సంబంధంలేని ఇతర సినిమా రంగ నిష్ణాతులు కూడా ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆయనకున్న అర్హతల్లా ఆయన మోడీపై సినిమా తియ్యటమే. దానితోపాటు మహాభారతం టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్రను పోషించాడు. ఒకప్పుడు మహామహులు నిర్వహించిన ఆ బాధ్యతలోకి రావటానికి ఈ అర్హతలు ఏమాత్రం సరిపోవు.

చిత్తూరు జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలి.

చిత్తూరు జిల్లాలో కరువు  తీవ్రమై ప్రజల జివీతం చిన్న భిన్నమయి అల్లాడుతూ, త్రాగడానికి  మంచి నీరు లేక, పశువులను అమ్ముకుని ఉపాధి కోసం పల్లెలాలను వదలి పట్టణలకు వలసలు వెళుతున్నారు . వేలాది ఎకరాల మామిడి చెట్లు  నిలువునా యన్దిపోతున్నాయి. ప్రభుత్వం నిమ్మకునిరేతినట్లు వ్యహరిస్తున్నది. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్ట్లని సి పి యం, సి పి ఐ పార్టీ నాయకులూ సమావేశం లో ప్రభువాన్ని  డిమాండ్ చేసారు .  

200 ఎకరాలు స్వాహా..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం. ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి.

ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రారంభం

కాకినాడ సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను జడ్‌పి ఛైర్మన్‌ నామన రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడంతోపాటు సమాజ మార్పునకు పుస్తక పఠనం దోహదం పడుతుందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ 'నేను మలాలా' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

కౌలు చెక్కులు, సమాన ప్యాకేజి ఇవ్వాలి..

అసైండ్, సీలింగ్ సాగుదారులకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని , పట్టాభూమితో సమాన ప్యాకేజి ఇవ్వాలని కోరుతూ అమరవతి (రాజధాని) ప్రాంతంలో సిపిఎం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు..శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులు, సిపిఎం నాయకుల్ని పోలీసులు  అక్రమంగా అరెస్టులు చేసి స్టేషనుకు తరలించారు.వీరిపై 144 సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేసారు. 

Pages

Subscribe to RSS - September