సెప్టెంబర్ 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. అందరి అంచనాలకు మించి కార్మికులు సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, పోస్టల్, బిఎస్‌ఎన్‌ఎల్, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్ ఉద్యోగులు, ఓడరేవులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ, బొగ్గు గనుల్లోనూ, రక్షణరంగ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు అత్యధిక శాతం సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ రవాణా కార్మికులతో పాటు ప్రయివేటు రంగ రవాణా కార్మికులు కూడా కలిసి దేశవ్యాప్తంగా సమ్మెచేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.