September

సంఘ్ సర్కార్‌..

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌), కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర అవగాహన భేటీ లౌకికవాదం, జాతి సమగ్రతలను ప్రశ్నార్ధకం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ సహా పలువురు మంత్రులు సంఫ్‌ు ప్రముఖుల వద్దకెళ్లి తమ ప్రోగ్రెస్‌ రిపోర్టులు సమర్పించడం ద్వారా కేంద్ర సర్కారు ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో నడుస్తోందని చెప్పకనే చెప్పారు. తమ సమావేశం సమాచార మార్పిడి కోసమని ఇరుపక్షాలూ పైకి చెబుతున్నా ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాను అమలు పరచడానికి కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసిన సమావేశమన్నది స్పష్టం.

ఇంత ఉదాసీినతా..?

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">పొగాకు ఉత్పత్తిలో బ్రెజిల్‌, అమెరికా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కర్నాటక, ఎపిలోనే సాగు అత్యధికం. పొగాకుపై ఏడాదికి రూ.20 వేల కోట్ల ఎక్సయిజ్‌ సుంకం, రూ.ఐదు వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి లభిస్తోంది. ఇంత ఆదాయం సమకూర్చిపెట్టడానికి కారకులైన పొగాకు రైతులంటే సర్కారుకు చులకన. వారికి గిట్టుబాటుధర కల్పనపై ఉదాసీనత.

దుర్మార్గం..

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిన తీరు దుర్మార్గం. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీసులు విరుచుకు పడిన తీరే పైనుండి అందిన ఆదేశాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అసాంఘిక శక్తులతోనూ, శత్రు సమూహాలతోనూ వ్యవహరించినట్లు పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించారు. విద్యార్థినులను సెల్‌ ఫోన్లో చిత్రీకరించడం, చున్నీలు గుంజడం, జుట్టు పట్టి లాగడం వంటి చర్యలు పోలీసుల అనాగరిక స్వభావాన్ని వెల్లడిస్తున్నాయి.

విశాల ఉద్యమం చేపట్టాలి: YV

కార్పొరేట్ల అనుకూల విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా తరగతుల ప్రజలు విశాల ఉద్యమం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. పార్టీ ఒంగోలు జిల్లా కమిటీ సమావేశం మంగళవారం సుందరయ్య భవన్‌లో జరిగింది. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాలా అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వై వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల అనుకూల విధానాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం గతం కంటే మరింతగా కార్పొ రేట్ల ప్రయోజనాలు కోసం పని చేస్తోందని విమర్శించారు.

సిపిఎం ఉచిత మెడికల్‌ క్యాంపు..

 తూర్పుగోదావరి జిల్లా చింతూరులో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక, ఎపిఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. మన్యంలో మలేరియా కేసులు లేవని ప్రభుత్వం చెబుతోంది. వైద్య శిబిరంలో బ్రెయిన్‌ మలేరియా కేసులు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చింతూరులో ఈనెల 23న ప్రారంభమైన వైద్య శిబిరం అక్టోబర్‌ 22 వరకు కొనసాగనుంది. బుధవారం 43 గ్రామాల నుంచి రోగులు తరలివచ్చారు. 109 మందికి పరీక్షించగా, 22 మంది జ్వరపీడితులు ఉన్నారు. వీరిలో ఆరు బ్రెయిన్‌ మలేరియా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  మిడియం బాబూరావు చెప్పారు.

సిఎం మాట నిలబెట్టుకోవాలి..

 ఇళ్ల స్థలాలు, పట్టాలు, సాగు భూముల కోసం పేదలు కదం తొక్కారు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రైతు సంఘం సంయుక్తంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం చేపట్టిన ధర్నాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది పేదలు తరలొచ్చారు.నీరు-చెట్టులో భాగంగా పేదలు ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువులు తవ్వి తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాసిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడారు. ఇళ్లస్థలాలు ఇస్తామని ఎన్నికలప్పుడు హామీనిచ్చిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

CRDA చట్ట సవరింపు..

ఏపీ సర్కార్ సీఆర్డీఏ చట్టాన్ని తాజాగా మళ్లీ సవరించింది. దీంతో ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి...ఇప్పుడు 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే అదనంగా 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది.కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం పూర్తిగా సీఆర్డీఏ లో కలిసింది. దీంతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను ఇందులో కలిపారు. గుంటూరు జిల్లాలోనూ 30 గ్రామాలు సీఆర్డీఏ లో అదనంగా కలిశాయి.

బిసిల హామీలు నెరవేర్చాలి:ఉమా

 చేతివృత్తిదార్లకు ఉపాధి చూపడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయ వాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం జరిగిన చేతివృత్తిదారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్‌ రంగంలో బిసిలకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాం డ్‌ చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో బిసిలకిచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిం చారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచర ణకు నోచడం లేదన్నారు.

SFI కలెక్టరేట్ల ముట్టడి..

రాష్ట్రంలోని హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికిస్తున్న మెస్‌ ఛార్జీ రూ.750 నుంచి రూ.1500లకు పెంచాలని, 50 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారనే సాకుతో మూసివేసిన 220 హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మంగళవారం జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు. అనంతపురం, కర్నూలు, కడప కలెక్టరేట్ల వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. కర్నూల్లో పదిమందిని అరెస్టు చేశారు. అనంతపురంలో వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్‌ చేరుకొని ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు గేట్లు ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

Pages

Subscribe to RSS - September