September

వాట్సప్‌పై కేంద్రం వెనకడుగు..

 జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానంపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఎన్‌క్రిప్షన్‌ ముసాయిదా స్థానంలో సవరించిన సంకేత/సంక్షిప్త(ఎన్‌క్రిప్షన్‌) ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించినది కేవలం ముసాయిదా మాత్రమేనని.... ప్రజల నుంచి అందిన సూచనల మేరకు మార్పులు చేసి త్వరలో తాజా విధానాన్ని అందుబాటులోకి తీసువస్తామని ఆయన చెప్పారు. సాధారణ వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధానముంటుందని పేర్కొన్నారు.

ట్రూ అప్‌ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల భారం

చెల్లించని వారి బకాయిలు ప్రజలపై మోపుతారా?
-  ఛార్జీలు పెంచితే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
-  పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికుల వీధులపాలు కాక తప్పదు
-  విద్యుత్తు కంపెనీలతో తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి
-  నేటి ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలో వ్యతిరేకిస్తాం : సిపిఎం

దోషులను బోనులో నిలబెడతాం

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">                'విశాఖ జిల్లా సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని భావించడం నేరమా? చదువుకునే వాతావరణం కలుగజేసేందుకు సమస్యలను పరిష్కారం చేయమని అడిగితే అణచివేయడమే సమాధానమా? ఉద్యమాల సందర్భంగా లాఠీఛార్జి వంటివి జరిగితే తప్పుచేశామని ఒప్పుకునే అలవాటు పోలీస్‌ ఉన్నతాధికారుల్లో కనిపించేది..

ట్రూ అప్‌ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల ప్రజలపై భారం- సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు

-  చెల్లించని వారి బకాయిలు ప్రజలపై మోపుతారా?
-  ఛార్జీలు పెంచితే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
-  పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికుల వీధులపాలు కాక తప్పదు
-  విద్యుత్తు కంపెనీలతో తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి
-  నేటి ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలో వ్యతిరేకిస్తాం : సిపిఎం

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రపంచబ్యాంకు పాలన మొదలైందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. 76,4260 ఎకరాలను కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్దమైందని ఆయన ఆరోపించారు. కార్మికసంక్షేమం పక్కన పెట్టడం వల్లనే ప్రపంచ బ్యాంకు పెట్టుబడి అనుకూలత రాష్ట్రముగా రెండం స్థానం ఏపీకి వచ్చిందని తెలిపారు. సర్కారు బలవంతపు భూసేరణ పై త్వరలో భారీ ఉద్యమం నిర్మించి రాష్ట్ర బంద్ కు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని మధు తెలిపారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యుటివ్ గా పేరు తెచ్చుకున్న బాబు మరో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలుపరస్తున్నారని మధు దుయ్యబట్టారు.

ప్రైవేటురిజర్వేషన్ల కోసంKVPS

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణల్లో సామాజిక న్యాయం లేకపోవడంతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు, ఉన్న ఉద్యోగాలకు భద్రత సన్నగిల్లుతున్నాయని కెవిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారావు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ భవన్‌లో బుధవారం కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు.

Pages

Subscribe to RSS - September