రాజధాని నిర్మాణం కోసం సేకరించే భూమి కాక, రాష్ట్రంలో పరిశ్రమల నిర్మాణం కోసం 15 లక్షల ఎకరాల భూమిని సమీకరి స్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అందుకను గుణంగానే వివిధ ప్రాంతాలలో సేకరించ టానికి భూములను గుర్తిస్తున్నది. కొన్ని చోట్ల నోటిఫికేషన్ జారీచేసి భూములను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఫారెస్టు భూములు, ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూములు, గతంలో దళితులు, పేదలకు పంచిన పట్టా భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వచ్చే పరిశ్రమలు వేళ్ళ మీద లెక్కబెట్టేటన్ని కూడా లేకపోయినా భూములు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటుండటంతో రైతులు భయాందోళనలతో తల్లడిల్లుతున్నారు.